Series Of Deaths : జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై కదిలిన ఎక్సైజ్‌ అండ్‌ ఎస్‌ఈబీ

మొత్తం 315 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 24 వేల 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 63 వేల 48 కేజీల బెల్లాన్ని సీజ్‌ చేశారు.

Series Of Deaths : జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై కదిలిన ఎక్సైజ్‌ అండ్‌ ఎస్‌ఈబీ

Jangareddygudem

excise and SEB raids : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు కదిలారు. నాటుసారా తయారీ, నిల్వలపై ఉక్కుపాదం మోపారు. అనేక ప్రాంతాల్లో దాడులు, తనిఖీలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నెల 10 నుంచి నిన్నటి వరకు జరిగిన తనిఖీల్లో 54 కేసులు నమోదు చేసి.. 34 మందిని అరెస్ట్ చేస్తారు. మొత్తం 315 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 24 వేల 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 63 వేల 48 కేజీల బెల్లాన్ని సీజ్‌ చేశారు. తనిఖీలు కొనసాగుతునే ఉంటాయని అధికారులు తెలిపారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ పోలీసులు భారీగా నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఏటపాక మండలం గుండువారి గూడెంలో నాటు సారా స్థావరాలపై చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారికి ఉపయోగించే పదివేల లీటర్ల బెల్లం ఊట, రవాణాకు సిద్ధంగా ఉన్న 70లీటర్ల నాటు సారా, సారా తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాటు సారా తయారీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నామని ఏఎస్పీ కృష్ణకాంత్ అన్నారు.

Jangareddy Goodem : జంగారెడ్డిగూడెంలో మిస్టరీగా మరణాలు.. ఇప్పటి వరకు 16 మంది మృతి

జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ జరిగే వరకూ తాము పోరాడుతామని టీడీపీ నేత లోకేశ్ అన్నారు. సహజ మరణాలైతే ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు నమోదుచేశారని నిలదీశారు. 4 రోజుల్లో 18వేల 300 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారని, 63 టన్నుల నల్ల బెల్లాన్ని సీజ్‌ చేశారని లోకేశ్ చెప్పారు. నాటు సారా బాధిత కుటుంబాలకు 25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహజ మరణాల పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.