Jangareddy Goodem : జంగారెడ్డిగూడెంలో మిస్టరీగా మరణాలు.. ఇప్పటి వరకు 16 మంది మృతి

జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై జంగారెడ్డిగూడెం ఆర్డీవో...

Jangareddy Goodem : జంగారెడ్డిగూడెంలో మిస్టరీగా మరణాలు.. ఇప్పటి వరకు 16 మంది మృతి

West Godavari

Deaths As A Mystery In Jangareddy Goodem : పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంగా గడుపుతున్నారు. తమ కళ్లెదుట ఉన్న వారు తెల్లారేసరికి విగతజీవులుగా మారిపోతుండడంతో వారిలో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అసలు ఎవరు ఎందుకు చనిపోతున్నారు ? వారి మృతికి కారణం ఏంటీ ? అనేది అర్థం కావడం లేదు. మిస్టరీగా మారిన మరణాలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు.

Read More : Nara Lokesh Alcohol Deaths : సారా మ‌ర‌ణాల‌న్నీ జ‌గ‌న్ స‌ర్కార్ హ‌త్య‌లే-నారా లోకేష్

జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై జంగారెడ్డిగూడెం ఆర్డీవో స్పందించారు. వివిధ వ్యాధులతో చనిపోతున్నారని చెబుతున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తో మాట్లాడారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించడం జరిగిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. 2022, మార్చి 12వ తేదీ శనివారం మరో ఇద్దరు చనిపోయారని ఆయన వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత అసలు విషయాలు బయటకొస్తాయని, ఎందుకు చనిపోతున్నారనే విషయం తెలిసిపోనుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శవరాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటై పోయిందని, జంగారెడ్డి గూడెం ఘటనపై బాబు అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read More : Chandrababu On Mystery Deaths : ప్రాణాలు పోతున్నా స్పందించరా? ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ప్రాణాలు పోతున్నా స్పందించరా? అని చంద్రబాబు నిలదీశారు. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని వాపోయారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More : BJP Leader JangaReddy passes away : పీవీని ఓడించిన చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత..ప్రధాని మోదీ నివాళి

సొంత చౌక మ‌ద్యం అధిక ధ‌ర‌ల‌కి విక్రయిస్తున్నారని, ఆ మ‌ద్యం కొన‌లేక సారా తాగి 15 మంది బలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఎక్సైజ్‌, ఎస్ఈబీ, జ‌గ‌న్ అధికార యంత్రాంగం ఏం చేస్తోందని లోకేష్ ప్రశ్నించారు. మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం, సంబ‌ధిత శాఖ స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోందన్నారు. జంగారెడ్డిగూడెం సారా మ‌ర‌ణాల‌పై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. మరి మరణాలకు కారణాలేంటో కొద్ది రోజుల్లో తెలువనుంది.