APs Tableau
ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించిన శకటాల్లో ఏపీకి చెందిన శకటానికి తృతీయ స్థానం దక్కిందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్ శకటం అగ్రస్థానంలో, త్రిపుర శకటం ద్వితీయ స్థానంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఉత్తర ప్రదేశ్ ఈ సారి ‘మహకుంభ్ 2025-స్వర్నిమ్ భారత్: వైరసాత్ ఔర్ వికాస్’ అనే పేరుతో శకటాన్ని రూపొందించింది. 40 శాతం ఓట్లతో పీపుల్స్ ఛాయిస్ అవార్డు విభాగంలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది.
ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఉగాదికి తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
మరోవైపు, త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు టీమ్ ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా ఎంపికైంది. అలాగే, కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీసు కవాతు టీమ్ ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా ఎంపికైంది. ఇక కేంద్ర ప్రభుత్వ శాఖల అంశానికి వస్తే.. ఈ విభాగంలో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైంది.
కాగా, మైగవ్ పోర్టల్ ద్వారా ఓటింగ్‌లో జరపగా, ప్రజల ప్రత్యేక ఎంపిక విభాగంలో త్రివిధ దళాల నుంచి ఆర్మీ సిగ్నల్స్ టీమ్ ఉత్తమ ప్రతిభ కింద ఎంపికైంది. పారా మిలిటరీ బలగాల నుంచి సీఆర్‌పీఎఫ్ కవాతు టీమ్స్ ఎంపికయ్యాయి. ఇక శకటాల్లో గుజరాత్ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో ఉత్తరప్రదేశ్, తృతీయ స్థానంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర శకటం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఉత్తమ శకటాలను ఎంపిక చేస్తుంది.
Karimnagar : 10టీవీ ఎఫెక్ట్.. నర్సింగాపూర్ భూకుంభకోణంపై అధికారుల సర్వే