YSRCP: వైసీపీలో వరుస అరెస్ట్‌లు.. అసలు రీజన్‌ అదేనా? వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది?

వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ గోరంట్ల మాధవ్‌దే అని చాలామంది అభిప్రాయం.

Posani Krishna Murali

మొన్న వంశీ.. నిన్న పోసాని.. మరి రేపు? ఇదే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడీ అరెస్ట్‌లు మాత్రం కొత్త చర్చకు, అంతకుమించి ప్రశ్నలకు తావిస్తోంది. భారీగా అవినీతి జరిగిందని.. అక్రమార్కుల అంతుచూస్తామని గతంలో పదే పదే చెప్పిన కూటమి సర్కార్.. ఆ యాంగిల్‌పై ఇంకా దృష్టి పెట్టలేదు. మరి వీళ్లనే ఎందుకు అరెస్ట్ చేస్తోంది.. ఈ అరెస్ట్‌లతో ఏం చెప్పాలనుకుంటోంది.. జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..

వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. కీలక నేతలు, కీలక మద్దతుదారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ సంగతి ఎలా ఉన్నా… పోసాని అరెస్ట్‌తో కొత్త చర్చ జరుగుతోంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం నోరు పారేసుకుంటే.. అది ఎప్పుడో ఒకప్పుడు బూమరాంగ్ అవకాశం ఉంటుందనే సంకేతాలు పంపిస్తోంది.

గతంలో పవన్ కల్యాణ్‌ మీద పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. రాష్ట్రంలో చాలా చోట్ల జనసేన నేతలు కేసులు పెట్టారు. ఆ కేసులో ఇప్పుడు పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో కొందరు నేతల మాటలకు కంట్రోల్ లేకుండా పోయిందన్నది నిజం. ఐతే ఇప్పుడు వాళ్లంతా కార్నర్ అవుతున్నారు. ఇక ఈ అరెస్ట్‌ల మీద.. ఎలా డిఫెండ్ చేయాలో తెలియక సొంత పార్టీ నేతలు కూడా అయోమయంలో పడిపోతున్నారు.

Also Read: అంత మాట అంటారా? నేను సహించను..: భారత మాజీ క్రికెటర్‌ తండ్రిపై వసీమ్ అక్రమ్ ఫైర్

పోసాని అరెస్ట్‌ వ్యవహారం నుంచి వైసీపీ నేతలు కోలుకోకముందే.. వైసీపీకి ఇప్పుడు మ‌రో దెబ్బ తగడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజ‌య‌వాడ‌లో న‌మోదైన కేసుకు సంబంధించి.. అనంతపురంలో మాధ‌వ్ నివాసానికి వెళ్లి మరీ ఆయనకు 41A కింద నోటీసులు జారీ చేశారు.

ఇప్పుడు లిస్ట్‌లో గోరంట్ల మాధవ్?
మార్చి 5న విచార‌ణకు రావాల‌ని పోలీసులు ఆదేశించారు. పోక్సో కేసులో ఓ బాధితురాలి పేరుని మాధవ్ బయటపెట్టి.. అసభ్యకరంగా మాట్లాడినట్లు మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొన్న వంశీ.. నిన్న పోసాని.. అంతకుముందు బోరుగడ్డ అనిల్.. ఇప్పుడు తర్వాత లిస్ట్‌లో గోరంట్ల మాధవ్ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ అరెస్ట్‌లతో కూటమి సర్కార్‌ రాజకీయాలకు.. ఓ రకమైన సందేశం ఇస్తుందా అనే చర్చ జరగుతోంది.

ఒకప్పుడు నేతల మధ్య మాటల యుద్ధం అంటే రాజకీయంగా ఉండేది. ఐతే గత కొంతకాలంగా రాజకీయమే మారుతోంది. వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కొందరు నేతలు. ఇక వాళ్లు వాడే భాష జుగుప్సాకరం, అసభ్యకరం, అభ్యంతకరంగా ఉందన్నది మరికొందరి అభిప్రాయం.

దీంతో సింపథీ వర్కౌట్ కాకపోగా.. ఒకరకమైన చర్చ జనాల్లో మొదలవుతోంది. దీంతో ఎలా రియాక్ట్ అవాలో తెలియక.. పార్టీ పెద్దలు కూడా చాలా టైమ్‌ తీసుకొని.. అప్పుడు ఓ మాట అనేస్తున్నారనే గుసగుసలు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్నాయ్. ఇలాంటి ఇక చెల్లవ్ అని పరోక్షంగా చెప్పేందుకే.. వరుస అరెస్ట్‌లు జరుగుతున్నాయా అనేది మరికొందరి వాదన.

ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయం?
వైసీపీపై సింపథీ ఫ్యాక్టర్ పక్కనపెట్టి.. ఇప్పుడు వరుస అరెస్ట్‌లతో జనాల్లో కొత్త చర్చ జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారిని, మహిళల్ని, పిల్లల్ని వదలకుండా రాజకీయం చేసిన వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.

నిజానికి గత ప్రభుత్వ అక్రమాలు బయటకు తీస్తామని పదేపదే చెప్పే కూటమి సర్కార్.. ఇంకా ఆ విషయం జోలికి వెళ్లలేదు. ప్రస్తుత అరెస్టులతో ఒక్కరు కూడా అయ్యో పాపం అనేవారు లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. వంశీ, పోసాని వరుసగా అరెస్ట్ అయినా.. సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాలేదంటే.. అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అనేవాళ్లు మరికొందరు.

వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ గోరంట్ల మాధవ్‌దే అని చాలామంది అభిప్రాయం. ప్రస్తుత కేసుకు తోడు.. చంద్రబాబు, లోకేశ్ మీదా గోరంట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలపై చాలా కేసులు నమోదయ్యాయ్‌. ఇప్పుడవన్నీ ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయం. రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ, ఇంత అసభ్యకరంగానా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. అభ్యంతరకరమైన రీతిలో ఎవరు మాట్లాడినా.. ఎవరు పోస్ట్ చేసినా.. జరిగేది ఇదే అని కూటమి సర్కార్ పరోక్షంగా సందేశం ఇస్తుందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.