Champions Trophy 2025: అంత మాట అంటారా? నేను సహించను..: భారత మాజీ క్రికెటర్‌ తండ్రిపై వసీమ్ అక్రమ్ ఫైర్

క్యాంపు ఏర్పాటు చేసి రమ్మంటే తాను వస్తానని వసీమ్‌ తెలిపారు.

Champions Trophy 2025: అంత మాట అంటారా? నేను సహించను..: భారత మాజీ క్రికెటర్‌ తండ్రిపై వసీమ్ అక్రమ్ ఫైర్

Wasim Akram

Updated On : February 28, 2025 / 7:28 PM IST

భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తాజాగా చేసిన కామెంట్లపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించారు. పాకిస్థాన్‌ క్రికెటర్ జట్టు ఆటతీరును మెరుగుపరచడానికి సాయం చేయనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు వసీమ్ అక్రమ్, షోయబ్ అఖ్తర్ శంటి వారు సిగ్గుపడాలంటూ యోగ్‌రాజ్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విమర్శల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.

దీనిపై వసీమ్ అక్రమ్‌ ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కొందరు కొన్నిసార్లు నన్ను విమర్శిస్తుంటారు. నేను ఒట్టి మాటలు మాట్లాడతానని, ఇంకేమీ చేయనని అంటుంటారు. పాకిస్థాన్ క్రికెట్‌ టీమ్‌కి కోచ్‌లుగా పనిచేసిన వకార్ యూనిస్ వంటి వారికి జరిగిన అవమానాన్ని నేను చూశాను. (వకార్ యూనిస్‌ను పలుసార్లు కోచ్‌ పదవి నుంచి తొలగించారు). అటువంటి కోచ్‌ల పట్ల పట్ల కొందరు విమర్శకులు మర్యాదలేకుండా మాట్లాడారు” అని అన్నారు.

Also Read: హీరోయిన్లు తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ పోలీసుల విచారణ ఎదుర్కొంటారా? 

కొందరు ఈ కోచ్‌లను అగౌరవపరుస్తారని, అలాంటి ప్రవర్తనను తాను అంగీకరించనని వసీమ్ చెప్పారు. పాకిస్థాన్‌ జట్టుకు తాను ఉచితంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే నెగిటివ్ కామెంట్లను స్వీకరించడానికి మాత్రం సిద్ధంగా లేనని చెప్పారు.

క్యాంపు ఏర్పాటు చేసి రమ్మంటే తాను వస్తానని వసీమ్‌ తెలిపారు. పెద్ద టోర్నమెంట్ల ముందు క్రికెటర్లతో సమయాన్ని గడపాలని తనను పిలిస్తే తాను వస్తానని అన్నారు. అయితే, 58 ఏళ్ల వయసులో తాను అవమానాలు ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా లేనని పేర్కొన్నారు ఒత్తిళ్లు లేకుండా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నుంని పాకిస్థాన్ జట్టు అవమానకరరీతిలో వెనుదిరగడంతో యోగ్‌రాజ్ సింగ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు వసీమ్ అక్రమ్, షోయబ్ అఖ్తర్ వంటివారి తీరును, వారు తమ సొంత టీమ్‌పై చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. సొంత జట్టుపై వసీమ్ అక్రమ్, షోయబ్ అఖ్తర్ చేసిన విమర్శలు సరికాదని చెప్పారు. వసీమ్ మంచి పేరున్న మాజీ క్రికెటర్ అని, అలాంటి వ్యక్తి పాక్‌ జట్టుపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

Also Read: బంగారం ధరలు ఉన్నట్టుండి ఎందుకు తగ్గుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు?