Gold: బంగారం ధరలు ఉన్నట్టుండి ఎందుకు తగ్గుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు?
బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా?

బంగారం కొనాలనుకుంటున్న వారికి ఊరటనిచ్చేలా ఇవాళ ధరలు తగ్గాయి. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే.. వారం మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడు తగ్గనంత ధర ఇవాళ తగ్గింది. అమెరికా డాలర్ బలపడటం వల్ల బులియన్‌పై ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా పెట్టుబడిదారులు రిజర్వ్ మానిటరీ పాలసీపై, అమెరికా ద్రవ్యోల్బణ డేటా కోసం ఎదురుచూడడం వల్ల బంగారంపై ఇన్వెస్ట్ చేయలేదని తెలుస్తోంది.
Click Here: ఈ బంగారం ధరలకు మళ్లీ ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు ఏమంటున్నారు?
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు
– స్పాట్ గోల్డ్ 0.4% తగ్గి ఔన్స్‌కు $2,864.33 వద్ద ఉంది
– అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% తగ్గి $2,875.00కి చేరాయి
భారత్‌లో బంగారం ధరలు
24 క్యారట్ గోల్డ్: రూ.8,684/గ్రామ్
22 క్యారట్ గోల్డ్: రూ.7,960/గ్రామ్
18 క్యారట్ గోల్డ్: రూ.6,513/గ్రామ్
గోల్డ్ రేటు గత ఎనిమిది వారాలుగా పెరుగుతూ వస్తుండగా, ఈ వారం 2.5% తగ్గుదల నమోదైంది. అయితే, ఫిబ్రవరి నెలలో మాత్రం 2.2% పెరుగుదల కనబడింది.
బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
అమెరికా డాలర్ బలపడడం: అమెరికా డాలర్ ఇండెక్స్ ఈ వారం 0.7% పెరగడం వలన డాలర్ బలపడింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు బంగారంవైపునకు చూడడం లేదు. బంగారం సురక్షిత పెట్టుబడి అయినప్పటికీ, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేయడంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ వ్యూహకర్త యెప్ జున్ రోంగ్ అన్నారు.
టారిఫ్‌లు, ద్రవ్యోల్బణ డేటా ప్రభావం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకునే వసువులపై 25% టారిఫ్‌లు, అలాగే చైనా ఉత్పత్తులపై అదనపు 10% డ్యూటీ ఛార్జీలు ప్రకటించారు. ఇది మార్చి 4 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో డాలర్ బలపడడంతో బంగారం ధరపై ప్రభావం పడింది. బంగారంపై లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఫెడ్ ద్రవ్యోల్బణ సూచీ కోసం ఎదురుచూడడం వల్ల బంగారం రేట్లు తగ్గాయి.
ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధాన ప్రభావం: ఫిలడెల్ఫియా ఫెడ్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హార్కర్ ప్రస్తుతం వడ్డీ రేట్లు 4.25%-4.50% మధ్య ఉండాలని సూచించడం వల్ల బంగారం ధరలకు మద్దతు తగ్గింది.
బలమైన డాలర్, టారిఫ్‌ల ప్రభావం వల్ల గోల్డ్ రేట్ తగ్గిపోయిందని మేహతా ఎక్విటీస్ కమోడిటీస్‌కు చెందిన రాహుల్ కలాంత్రి చెప్పారు.