Gold prices: ఈ బంగారం ధరలకు మళ్లీ ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు ఏమంటున్నారు?

పండుగలు, వివాహాల సమయంలో మన భారత్ లో బంగారంపై డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

Gold prices: ఈ బంగారం ధరలకు మళ్లీ ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు ఏమంటున్నారు?

Updated On : March 3, 2025 / 5:01 PM IST

బంగారం అనేది అంతర్జాతీయంగా వ్యాపారం చేసేందుకు వీలు ఉండే ఒక వస్తువు అని అందరికి తెలిసిన విషయమే. ప్రపంచ మార్కెట్లలో దాని ధరలు మారినప్పుడు, భారతదేశంలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది.

ముఖ్యంగా పండుగలు, వివాహాల సమయంలో మన భారత్ లో బంగారం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గత నాలుగు రోజులు నుంచి తగ్గుతున్న బంగారం ధరలు ఇవాళ మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి.

పెరగడానికి కారణాలు ఏంటంటే?

1) అమెరికా డాలర్ బలహీన పడటం
2) పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు
3) ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శాంతి ఒప్పందం ఆలస్యం కావడం
4) అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు పెరుగుతాయని పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడం
5) స్పాట్ గోల్డ్ 0.3% పెరిగి 1 ఔన్సుకు $2,866.76 వద్ద స్థిరపడింది. ఇక అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 1.1% పెరిగి $2,880.50కు చేరింది
6) డాలర్ ఇండెక్స్ 0.4% తగ్గడంతో, ఇతర కరెన్సీలతో పోల్చితే బంగారం కొనుగోలు చౌకగా మారింది. దీని ప్రభావంతో బంగారం ధరలు పెరిగాయి

Also Read: తమ కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ పేర్లను ప్రకటించిన కేకేఆర్‌.. ఇంకా ఏ జట్టు ప్రకటించాల్సి ఉందో తెలుసా?

భారత్‌లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

22 క్యారట్ బంగారం ధర రూ.79,400 (10 గ్రాములకు)
24 క్యారట్ బంగారం ధర రూ.86,620 (10 గ్రాములకు)
18 క్యారట్ బంగారం ధర రూ.64,970 (10 గ్రాములకు)

నిన్నటి గోల్డ్ రేటుతో పోల్చితే ఇండియాలో పసిడి ధర స్థిరంగానే కొనసాగుతుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేటులో తేడాలు కనిపించాయి. దీని ప్రభావం ఇండియాపై పడుతుందని నిపుణులు అంటున్నారు.

డిమాండ్ పెరగడంపై ఆర్థిక నిపుణులు ఏమన్నారంటే?

ఉక్రెయిన్-రష్యా ల మధ్య శాంతి ఒప్పందం ఆలస్యం కావడం వల్ల ఆసియా మార్కెట్‌లో బంగారంపై డిమాండ్ పెరిగిందని సీనియర్ మార్కెట్ అనలిస్ట్ కెల్విన్ వాంగ్ అన్నారు.

అంతేకాక, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశంలో కొంత గందరగోళం ఏర్పడి చర్చల పలితపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదనంగా రేపటి నుంచి కెనడా, మెక్సికో దేశాలపై కొత్త సుంకాలు అమలు చేస్తామని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ ప్రకటించడం కూడా ఒక కారణమని చెప్పొచ్చు.

ఫిబ్రవరిలో విధించిన 10% సుంకాలను రెట్టింపు చేసి చైనా ఉత్పత్తులపై మరింత భారం వేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇవ్వడం.

ఫిబ్రవరి 28న విడుదలైన అమెరికా ఆర్థిక గణాంకాల ప్రకారం, జనవరిలో వినియోగదారుల వ్యయం అనూహ్యంగా తగ్గింది. అంటే అమెరికా ప్రజలు వస్తువులు లేదా ఇతరత్రాల కోసం ఖర్చు చేసిన మొత్తం ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. దాని వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యమయ్యే అవకాశం ఉండడం వల్ల బంగారం రేటు స్వల్పంగా పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.