IPL 2025: తమ కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ పేర్లను ప్రకటించిన కేకేఆర్‌.. ఇంకా ఏ జట్టు ప్రకటించాల్సి ఉందో తెలుసా?

ఐపీఎల్‌ 2025 మొట్టమొదటి మ్యాచులో కేకేఆర్ ఈ నెల 22న ఆర్సీబీతో తలపడనుంది.

IPL 2025: తమ కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ పేర్లను ప్రకటించిన కేకేఆర్‌.. ఇంకా ఏ జట్టు ప్రకటించాల్సి ఉందో తెలుసా?

Pic: @KKRiders

Updated On : March 3, 2025 / 4:41 PM IST

ఐపీఎల్‌ 2025 ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న వేళ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తమ కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. అజింక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేకేఆర్‌ తెలిపింది.

వెంకటేశ్‌ అయ్యర్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని చెప్పింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఫ్రాంఛైజీ ఇవాళ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. కేకేఆర్‌కు అజింక్యా రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌ కెప్టెన్‌ అవుతారని ముందునుంచే ఊహాగానాలు ఉన్నాయి.

చివరకు అజింక్యా రహానేకు కెప్టెన్సీ దక్కింది. ఐపీఎల్‌ 2024లో టైటిల్‌ను అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదన్న విషయం తెలిసిందే. అంతేగాక, మెగా వేలంలోనూ అతడిని వద్దనుకుంది. ఇప్పటికే ఢిల్లీ మినహా అన్ని జట్లకూ క్యాప్టెన్లు ఎవరో తెలిసిపోయింది. ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్‌ను లేదంటే అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా చేసే ఛాన్స్ ఉంది.

Also Read: ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

మరోవైపు, కోల్‌కతా జట్టు ఇవాళ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. జెర్సీపై 3 స్టార్లు కనపడుతున్నాయి. తమ జట్టు మూడు టైటిళ్లను దక్కించుకుందని కేకేఆర్ పోస్ట్ చేసింది. 2012, 2014, 2024న తాము కప్‌ కొట్టామని తెలిపింది. మిథున రాశి రోజునే అన్ని కప్పులు కొట్టడం విశేషమని చెప్పింది.

ఐపీఎల్‌ 2025 మొట్టమొదటి మ్యాచులో కేకేఆర్ ఈ నెల 22న ఆర్సీబీతో తలపడనుంది. ఫైనల్‌ మ్యాచు మే 25న జరుగుతుంది. పలు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో మంగళవారం ఆస్ట్రేలియాతో టీమిండియా తలబడుతుంది.