AP SSC Hall Ticket: ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
కొన్ని నిమిషాల్లోనే హాల్‌టికెట్ మీ వాట్సప్‌కి వస్తుంది.

Ssc
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేశారు. bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ నుంచే కాకుండా మన మిత్ర, వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చు. అందుకోసం విద్యార్థులు అప్లికేషన్ నంబరు, ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి.
వెబ్ ద్వారా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
- https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లండి
- ఎస్ఎస్సీ హాల్ టికెట్ల లింక్‌పై క్లిక్ చేయండి
- రెగ్యులర్/ప్రైవేట్/వొకేషనల్/ఓఎస్ఎస్సీలో మీరు ఏ విధానంలో చదువుతున్నారో దానిపై క్లిక్ చేయాలి
- మీ పేరు, జిల్లా, స్కూల్ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి
- తర్వాత హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి
వాట్సప్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- 9552300009 నంబర్‌కి Hi అని వాట్సప్‌లో మెసేజ్ చేయండి
- మీకు ఓ లింక్ వస్తుంది
- దానిపై క్లిక్ చేస్తే సర్వీసుల లిస్ట్ వస్తుంది
- విద్య సర్వీస్‌పై క్లిక్ చేయండి
- ఎస్సెస్సీ హాల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని టైప్ చేయండి
- మీ స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకోండి
- రెగ్యులర్/ప్రైవేట్/ఓఎస్‌ఎస్‌సీ గ్యులర్/ ప్రైవేట్, వొకేషనల్లో మీది ఏదో ఎంచుకోండి
- తర్వాత కొన్ని నిమిషాల్లోనే హాల్‌టికెట్ వాట్సప్‌కి వస్తుంది