Kajal-Tamannaah: హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ పోలీసుల విచారణ ఎదుర్కొంటారా?
ఆ కంపెనీకి చెందిన వారు ముంబైలో ఓ పార్టీ నిర్వహించారు.

హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ పోలీసుల విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించాలని నిర్ణయించారు.
పుదుచ్చేరిలో ఈ క్రిప్టో కరెన్సీ మోసం జరిగింది. అందులో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు పొందవచ్చని పుదుచ్చేరికి చెందిన పది మంది నుంచి దాదాపు రూ.2.40కోట్లు తీసుకుని మోసం చేసినట్లు అశోకన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: బంగారం ధరలు ఉన్నట్టుండి ఎందుకు తగ్గుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు?
ఆ క్రిప్టో కరెన్సీ కంపెనీని మూడేళ్ల క్రితం తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రారంభించారు. ఇందులో తమన్నా పాల్గొంది. అలాగే, మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్‌లో ఆ క్రిప్టో కరెన్సీ సంస్థ ఓ కార్యక్రమం నిర్వహించగా ఇందులో కాజల్ అగర్వాల్ పాల్గొంది.
అనంతరం ఆ కంపెనీకి చెందిన వారు ముంబైలో ఓ పార్టీ నిర్వహించారు. ప్రచారం చేసుకుని వేలాది మంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నితీశ్, అరవింద్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతుండగా, ఇందులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్‌ను విచారించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.