Andhra Pradesh : రూ.లక్ష ఇస్తే వారానికి రూ.3వేలు వడ్డీ చెల్లిస్తామని రూ.10కోట్లు దోచేసిన ఏఆర్టీ జ్యూవెలరీ సంస్థ

అధిక వడ్డీకి ఆశపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశాక బోర్డు తిప్పేసింది మరో సంస్థ. లక్ష రూపాయలు డిపాజిడ్ కడితే వారానికి రూ.3వేలువడ్డీ ఇస్తామంటూ రూ.10 కోట్లు దోచేసింది.

Andhra Pradesh : అధిక వడ్డీకి ఆశపెట్టి ఆనక బోర్డు తిప్పేసిన సంస్థల మోసాలు కొనసాగుతునే ఉన్నాయి. చిట్టీల పేరుతో మోసాలు,రియల్ ఎస్టేట్ పేరుతో దగాలు, కాల్ మనీ పేరు చెప్పి దోపిడీలు ఇలా ఎన్ని మోసాలు జరుగుతున్నా అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతునే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏఆర్టీ జ్యూవెలరీ (ART jewellery) సంస్థ లక్ష రూపాయలు కడితే వారానికి రూ.3,000లు వడ్డీ ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది? జనాలు ఎగబడ్డారు. లక్ష రూపాయలకు వారానికే రూ.3వేలు వడ్డీ వస్తుందికదా అంటూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, రూపాయి రూపాయి పొదుపు చేసుకున్నవారు చాలామంది సదరు జ్యూవెలరీ షాపు యజమాని వలలో పడ్డారు. భారీగా డిపాజిట్టు కట్టారు. అలా రూ. కోట్లు పట్టుకుని జ్యూవెలరీ షాపు యజమాని మాయం అయిపోయాడు.

దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఏఆర్టీ జ్యూవెలరీ షాపు యజమాని విజయ కోసం గాలిస్తున్నారు. రూ.లక్ష కడితే వారానికి రూ.3వేలు వడ్డీగా ఇస్తానని ఏడాది తరువాత అసలు పూర్తిగా ఇచ్చేస్తానంటూ ప్రకటించాడు ఏఈర్టీ షాపు యజమాని విజయ్. అంతేకాదు డిపాజిట్టు కడితే అదనంగా నగదు చెల్లిస్తానని చెప్పాడు. దీంతో ఎంతోమంది అధిక వడ్డీ వస్తుంది కదాని ఆశపడ్డారు. అలా పలువురు రూ. 10కోట్లు వరకు ఏఆర్టీ షాపు యజమానికి కట్టారు. ఆ తరువాత ఇంకేముంది..కట్టిన డబ్బులకు వడ్డీ ఇవ్వాలని కోరారు. కానీ కాలయాపన చేస్తు డబ్బులు ఇవ్వకుండా దాట వేస్తున్నాడు. కానీ డబ్బులు కట్టినవారు మాత్రం ఒత్తిడి చేయగా బోర్డు తిప్పేసి ఝలక్ ఇచ్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఏఆర్టీ యజమాని విజయ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Woman Cheat : లక్షకు లక్ష ఇస్తా.. అధిక వడ్డీ పేరుతో ఘరానా మోసం, వనస్థలిపురంలో రూ.14కోట్లతో మహిళ పరార్

కాగా.. హైదరాబాద్ వనస్థలిపురంలో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ పేరుతో స్వర్ణలత అనే మహిళ రూ.లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తానని నమ్మించి 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బుతో పరార్ అయ్యింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎల్బీనగర్ డీసీపీ వద్దకు వెళ్లి బాధితులు మొరపెట్టుకున్నారు. కాగా, గతంలోనూ స్వర్ణలతపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఇలా అధిక వడ్డీల పేరుతోను..చిట్టీల పేరుతోను మోసాలు కొనసాగుతునే ఉన్నాయని ఇటువంటివాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు