Woman Cheat : లక్షకు లక్ష ఇస్తా.. అధిక వడ్డీ పేరుతో ఘరానా మోసం, వనస్థలిపురంలో రూ.14కోట్లతో మహిళ పరార్

Woman Cheat : లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తానని నమ్మించింది. 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత..

Woman Cheat : లక్షకు లక్ష ఇస్తా.. అధిక వడ్డీ పేరుతో ఘరానా మోసం, వనస్థలిపురంలో రూ.14కోట్లతో మహిళ పరార్

Woman Cheat

Woman Cheat : హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని అడ్డంగా మోసగించింది స్వర్ణలత అనే మహిళ. లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తానని నమ్మించింది. ఆశ పెట్టింది. అలా సుమారు 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బుతో పరార్ అయ్యింది.

తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎల్బీనగర్ డీసీపీ వద్దకు వెళ్లి బాధితులు మొరపెట్టుకున్నారు. కాగా, గతంలోనూ స్వర్ణలతపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.

”వెంచర్ లో పెట్టుబడి పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పింది. రూ.5లక్షలు ఇస్తే రూ.7లక్షలు ఇస్తా అంది. అందరి దగ్గర అప్పులు చేయించింది. ఇప్పుడు మేము బతకలేని పరిస్థితి. డబ్బంతా ఎవరి దగ్గర పెట్టావో చెప్పు అంటే.. అది నా పర్సనల్ వ్యవహారం. నీకు అనవసరం అని గొడవకు దిగింది. మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది” అని ఓ బాధితురాలు కన్నీటిపర్యంతమైంది.

Also Read..Man Burnt Alive : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు సజీవదహనం కేసు.. మృతుడి తమ్ముడు వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణం

రియల్ ఎస్టేట్, అధిక వడ్డీ పేరుతో అమాయక మహిళలను స్వర్ణలత అడ్డంగా మోసగించింది. బాధితులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం ఎల్బీనగర్ డీసీపీని కలిసి మరోసారి స్వర్ణలతపై బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

లక్ష కడితే లక్ష ఇస్తా:
లక్ష రూపాయలు కడితే అధిక వడ్డీ ఇస్తామని స్వర్ణలత నమ్మించింది. ఇలా 50 మంది నుంచి సుమారు 14 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ 50మంది బాధితులు చాలామంది దగ్గర డబ్బు తీసుకుని స్వర్ణలతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలయ్యాక స్వర్ణలత ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది. సడెన్ గా కనిపించకుండా పోయింది. దాంతో డబ్బు కట్టిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు.

తాము మోసపోయామని తెలుసుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు. తమ డబ్బు తమకు వెనక్కి ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్వర్ణలత వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. స్వర్ణలత అందుబాటులో లేదు. స్వర్ణలతకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు బాధితులకు ఒక భరోసా ఇచ్చారు.

Also Read..Maharashtra: హెయిర్ కటింగ్ నచ్చలేదని 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలుడు

ఇళ్లల్లో పని చేసుకునే మహిళలే టార్గెట్:
తాము కట్టిన డబ్బు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. లేదంటే తమకు చావు తప్ప మరో దారి లేదంటున్నారు. అమాయక మహిళలు, ఇళ్లల్లో పని చేసుకునే వారినే ఎక్కువగా స్వర్ణలత టార్గెట్ చేసింది. అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది. లక్ష రూపాయలు కడితే చాలు అదనంగా మరో లక్ష రూపాయలు ఇస్తానని ఆశ పెట్టింది. పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నామని, డబ్బు కడితే డబుల్ మనీ గ్యారంటీ అని నమ్మించి మోసం చేసింది. ఎక్కువగా మహిళలు అందునా ఇళ్లల్లో పని చేసుకునే వారిని స్వర్ణలత టార్గెట్ చేసింది.