Man Burnt Alive : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు సజీవదహనం కేసు.. మృతుడి తమ్ముడు వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణం

పథకం ప్రకారం కుట్రపన్ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజును బొప్పరాజుపల్లి కనుమదారిలో దారుణంగా హత్య చేశారని తెలిపారు.  రుపింజయ భార్యతో హతుడు నాగరాజు తమ్ముడు పురుషోత్తం వివాహేతర సబంధం కొనసాగించడమే హత్యకు ప్రధానం కారణమని వెల్లడించారు.

Man Burnt Alive : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు సజీవదహనం కేసు.. మృతుడి తమ్ముడు వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణం

సొంపల్లి నాగరాజు (ఫైల్ ఫొటో)

Man Burnt Alive : తిరుపతి జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు సజీవ దహనం కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కారులో బంధించి పెట్రోల్ పోసి, నిప్పంటించి తగలబెట్టారు. ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఏఎస్పీ వెంకట్రావ్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు ఏ1 రూపంజయ, ఏ2 చాణక్య ప్రతాప్, ఏ3 గోపినాథ్ రెడ్డి, ఏ4 అప్పన రమేష్, ఏ5 అప్పన కుమార్ ఉన్నారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న ఏ2 చాణిక్య ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

పథకం ప్రకారం కుట్రపన్ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజును బొప్పరాజుపల్లి కనుమదారిలో దారుణంగా హత్య చేశారని తెలిపారు. రూపంజయ భార్యతో హతుడు నాగరాజు తమ్ముడు పురుషోత్తం వివాహేతర సబంధం కొనసాగించడమే హత్యకు ప్రధానం కారణమని వెల్లడించారు. తన భార్య వివాహేతర సంబంధాన్ని నాగరాజు గ్రామంలో ప్రచారం చేసి పరువు తీయడంతో నాగరాజును రూపంజయ చంపాడని పేర్కొన్నారు. నాగరాజుకు ఫుల్ గా మద్యం తాగించి ముక్కు, నోరును అదిమి చంపి.. కారులో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని.. నేరం చేసిన వారు తప్పించుకోలేరని పేర్కొన్నారు.

Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం.. కారులో వ్యక్తిని బంధించి సజీవదహనం చేసిన దండగులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సొంపల్లి నాగరాజు(35) అనే వ్యక్తిని దుండగులు కారులో బంధించి పెట్రోల్ పోసి, నిప్పంటించి తగలబెట్టారు. నాగరాజు తిరుపతి నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యమయ్యాయి. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సొంపల్లి నాగరాజు(35) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అయితే, తన తమ్ముడు పురుషోత్తం ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆరోపణల వల్ల గ్రామంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. దీని కోసం నాగరాజు బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చారు. అయితే నాగరాజు తన తమ్ముడిని సమర్థిస్తూ, అతని వైపు మాట్లాడుతున్నారని అవతలి వర్గం ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని పిలిచి బొప్పరాజుపల్లి కనుమలో నాగరాజుతో గుర్తుతెలియని వ్యక్తులు ఘర్షణ దిగిగారు. నాగరాజును కారులో కూర్చోపెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో నాగరాజు సజీవ దహనం అయ్యారు.

Delhi Murder: ఢిల్లీలో దారుణం.. ముప్పై రూపాయల కోసం వ్యక్తి హత్య.. నిందితుల అరెస్ట్

గుర్తుపట్టలేనంతగా మృతదేహం కాలి బూడిదైంది. కారు నెంబర్ ఆధారంగా మృతుడు నాగరాజు అని గుర్తించారు. కాగా, నమ్మించి పిలిచి తన అన్నను కిరాతకంగా చంపేసారని నాగరాజు తమ్ముడు పురుషోత్తం ఆరోపించారు. గ్రామానికి చెందిన చాణక్యప్రసాద్, రూపంజయ, గోపి ఈ పని చేశారని మృతుడి తండ్రి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై హత్యా నేరంగా కేసు నమోదు చేశామని ఏఎస్పీ వెంకటరావు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా మృతుడు నాగరాజుగా తేల్చామని చెప్పారు.