Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం.. కారులో వ్యక్తిని బంధించి సజీవదహనం చేసిన దండగులు

కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యమయ్యాయి. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం.. కారులో వ్యక్తిని బంధించి సజీవదహనం చేసిన దండగులు

man burnt alive

Tirupati : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. కారులో ఓ వ్యక్తిని బంధించి దండగులు సజీవదహనం చేశారు. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సొంపల్లి నాగరాజు(35) అనే వ్యక్తిని దుండగులు కారులో బంధించి పెట్రోల్ పోసి, నిప్పంటించి తగలబెట్టారు. నాగరాజు తిరుపతి నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, పరిశీలించారు.

కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యమయ్యాయి. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సొంపల్లి నాగరాజు(35) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అయితే, తన తమ్ముడు పురుషోత్తం ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆరోపణల వల్ల గ్రామంలో ఘర్షణ జరిగింది.

Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి

ఈ నేపథ్యంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. దీంతో నాగరాజు బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చారు. అయితే నాగరాజు తన తమ్ముడిని సమర్థిస్తూ, అతని వైపు మాట్లాడుతున్నారని అవతలి వర్గం అంటున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని పిలిచి బొప్పరాజుపల్లి కనుమలో నాగరాజుతో గుర్తుతెలియని వ్యక్తులు ఘర్షణ దిగిగారు.

నాగరాజును కారులో కూర్చోపెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో నాగరాజు సజీవ దాహనం అయ్యారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహం కాలి బూడిదైంది. కారు నెంబర్ ఆధారంగా మృతుడు నాగరాజు అని గుర్తించారు.కాగా, నమ్మించి పిలిచి తన అన్నను కిరాతకంగా చంపేసారని నాగరాజు తమ్ముడు పురుషోత్తం ఆరోపిస్తున్నారు.

Hyderabad : పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

ఏఎస్పీ వెంకట రావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై హత్యా నేరంగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా మృతుడు నాగరాజుగా తేల్చామని చెప్పారు. గ్రామానికి చెందిన చాణక్యప్రసాద్, రూపంజయ, గోపి ఈ పని చేశారని మృతుడి తండ్రి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు.