Hyderabad : పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీలో  గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు.  హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదారుణం  చోటు చేసుకుంది.

Hyderabad : పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

West Godavari Sara Merchant Murder In Ap

Updated On : June 12, 2021 / 5:43 PM IST

Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో  గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు.  హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదారుణం  చోటు చేసుకుంది. పాతబస్తీ శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శనివారం నిర్మాణంలో ఉన్న ఆ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడనే సమాచారం పోలీసులకు అందింది.

చార్మినార్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహానికి  పంచనామ నిర్వహించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.  మృతుడు వివరాలు ఇంకా తెలియరాలేదని, మృతుడు ఎవరో తెలిస్తే కానీ, హాత్య ఎందుకు జరిగింది ? ఎవరు చేశారు ? అనే విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.