Arunkumar Vundavalli : బాంబు పేల్చిన ఉండవల్లి.. చంద్రబాబు కేసుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిల్ దాఖలు చేశారు. Arunkumar Vundavalli

Arunkumar Vundavalli (Photo : Google)

Arunkumar Vundavalli – Chandrababu Case : చంద్రబాబు కేసుపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ కేసుపై సమగ్ర దర్యాఫ్తు జరపాలంటూ పిల్ లో కోరారు. ఈ కేసుని సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని కోరిన ఉండవల్లి.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిల్ దాఖలు చేశారు.

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించి ఒకవైపు ఏపీ హైకోర్టులోనూ, మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బెయిల్, క్వాష్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి తుది ఆదేశాలు రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ ఉండల్లి అరుణ్ కుమార్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన పెద్ద సంచలనానికే తెరతీశారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ కేసుని సీబీఐ అప్పగించాలని హైకోర్టులో పిల్ వేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Also Read..Chandrababu : చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.. కొన్ని తీర్పులు రిజర్వ్, మరికొన్ని వాయిదా.. ఏం జరగనుంది?

ఈ కేసులో సమగ్ర దర్యాఫ్తు జరగాలంటే సీబీఐకి ఇవ్వాలని, సీబీఐ మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో విచారిస్తుందని చెప్పి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్ కు సంబంధించి ఇంకా నెంబరింగ్ అయితే రాలేదు. అయితే, కేసుని సీబీఐతో దర్యాఫ్తు చేస్తే అన్ని రకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. హైప్రొఫైల్ వ్యక్తులు ఉన్న ఈ కేసు, సంక్లిష్టంగా ఉన్న ఇలాంటి కేసులను సీబీఐ లోతుగా దర్యాఫ్తు చేస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు, అవినీతి బయటకు పడతాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ఆయన ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ కు సంబంధించి నెంబరింగ్ వచ్చిన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది చూడాలి.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్‌పై చంద్రబాబు రిలీజ్ అవుతారని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. ఇంతలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనం సృష్టించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కేసులో ఉన్న సంక్లిష్టత, హై ప్రొఫైల్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్న దృష్ట్యా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తన పిటిషన్‌లో కోరారు ఉండవల్లి. ఓవైపు చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై తుది తీర్పు రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ విచారణ కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read..YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. ఇక, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం ఏసీబీ కోర్టు నుంచి తుది ఆదేశాలు వెలువడాల్సి ఉంది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అనుమతించాలని ఏసీబీ న్యాయస్థానాన్ని కోరింది సీఐడీ. బెయిల్, కస్టడీ, క్వాష్ పిటిషన్లపై తుది ఆదేశాలు ఎలా ఉంటాయో అని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిణామాల మధ్య ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి, ఉండవల్లి వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు