AP Govt: ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు లేనట్లే.. త్వరలోనే ఉత్తర్వులు?

ఏపీలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

Jagan

AP Govt: ఏపీలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. కరోనా సెకండ్ నేపథ్యంలో గత ఏడాది రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరి ఇళ్లలో వారు సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరింది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షల సడలింపులు అమల్లో ఉన్నా వినాయక మండపాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది.

వినాయక మండపాల వద్ద అధిక జనాభా గుమిగూడతారనే ఆలోచనతో ఈ ఏడాది కూడా గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను కూడా ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు అమలు అవుతున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని సీఎం వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనుండగా అధికారులు కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది.