విజయనగరం పూసపాటి రాచ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం .. ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మాన్సాస్ ట్రస్ట్(MANSAS TRUST), మూడు లాంతర్ల (Three Lanterns Pillar) వ్యవహారంతో బాబాయ్, అమ్మాయ్‌కి మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. అసలు విజయనగరం మహారాజుల వారసత్వం ఎవరిది..? మాన్సాస్ ట్రస్ట్ ఎందుకు చేతులు మారింది..?
మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత మరో వివాదం:
విజయనగరం పూసపాటి వంశీయులకు చెందిన మాన్సస్ ట్రస్ట్, అలాగే సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ నియామకంలో జరిగిన పరిణామాలు మరువక ముందే తాజాగా విజయనగరంలో చోటుచేసుకున్న మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత మరో వివాదానికి దారితీసింది. అతిపురాతనమైన ఈ కట్టడాన్ని కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు రాజవంశీయులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం.. ప్రభుత్వ నేతల తీరుపై అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. అయితే అశోక్ గజపతిరాజు అన్న కుమార్తె సంచైత కూడా ట్విట్టర్ వేదికగా బాబాయ్‌పై విమర్శలు గుప్పించారు.
మోతీ మహల్‌ను ఎందుకు కూల్చారు:
1969లో నిర్మించిన మోతీమహల్‌ను ఎందుకు కూల్చివేశారని.. దాన్ని కూల్చకుండా బాగు చేయించొచ్చుగా అని ప్రశ్నించారు.. సంచైత. అయితే ఆమె తాత, తండ్రులు బతికి ఉండగానే వీటిని కూల్చివేశారని.. అప్పుడు ఎందుకు సంచైత ఈ ప్రశ్న అడగలేదంటూ అశోక్ గజపతి లేవనెత్తిన ప్రశ్న .. ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంచైత ప్రస్తావించిన మోతీ మహల్ పూర్తిగా శిథిలమైందని దానిని పాఠశాలగా ఉపయోగిస్తున్నందువల్ల .. అది అకస్మాత్తుగా కూలిపోతే.. ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని అశోక్ చెప్పారు. అందుకే దాన్ని కూల్చి.. ఆ భవనం స్థానంలో మరో భవనాన్ని నిర్మించేందుకు .. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు.
సంచైత రాజకీయాల్లోకి వచ్చింది అందుకేనా:
అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని, వారసత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికే సంచైతను రాజకీయంగా రంగంలోకి దించారన్న ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో .. సంచైత కూడా తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు. పూసపాటి వంశీయుల వారసత్వ సంపద కేవలం ఒక్క వ్యక్తి చేతిలో ఉండదని .. అది తరతరాల నుంచి వస్తోందని చెబుతోంది. తాము కేవలం వారసత్వ సంపదకు సంరక్షకులం మాత్రమే అంటోంది. దీంతో బాబాయ్ అమ్మాయ్ మధ్య వాగ్వాదం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
Read: ఏడాది పాలనలో కేకు సంబరాలే తప్ప..డెవలప్ మెంట్ లేదు : వైసీపీ ఎమ్మెల్యే ఫైర్