Nallapareddy Prasanna Kumar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసం..

ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.

Nallapareddy Prasanna Kumar Reddy: నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేటు సెంటర్ లో ఉన్న వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. దుండగులు ఇంటిలోని ఫర్నీచర్ తో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. ఇవాళ మధ్యాహ్నం రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. కాగా, దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది.

Also Read: వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తామంటున్నారా? అసలు వెళ్లింది ఎందుకు, వస్తామంటున్నది దేనికి..