Gossip Garage: వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తామంటున్నారా? అసలు వెళ్లింది ఎందుకు, వస్తామంటున్నది ఎందుకు..

జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.

Gossip Garage: వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తామంటున్నారా? అసలు వెళ్లింది ఎందుకు, వస్తామంటున్నది ఎందుకు..

Updated On : July 7, 2025 / 8:46 PM IST

Gossip Garage: ఏడాది కింద వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ వెంటనే ఒక్కో నేత..ఏపీలోని ఈ ప్రాంతం..ఆ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని జిల్లాల నుంచి నేతలు..ఫ్యాన్ స్విచ్ఛాఫ్ చేసి..అయితే సైకిల్ ఎక్కారు. లేకపోతే బీజేపీ, జనసేన గూటికి చేరారు. అలా అప్పుడు వైసీపీని వీడిన లీడర్లలో చాలా మంది తిరుగుముఖం పట్టేందుకు రెడీ అవుతున్నట్లు ఓ ప్రచారం బయలుదేరింది. అలా వస్తానంటున్న లీడర్లకు గ్రీన్ సిగ్నల్ వైసీపీ అధిష్టానం కూడా భావిస్తోందట. ఇంతకు వస్తానంటున్నదెవరో..? వాళ్లు ఎందుకు తిరిగి వైసీపీలో చేరాలనుకుంటున్నారో తెలియదు కానీ..ఈ గాసిప్ అయితే ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

కొందరు రాజకీయ అవసరాల కోసం..మరికొందరు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం..ఇంకొందరు షెల్టర్ పొందేందుకు కూటమి పార్టీల్లోకి జంప్ అయ్యారు. అయితే ఎంట్రీ బానే ఉన్నా..కొన్ని ఇష్యూస్, ఘటనల వల్ల..టీడీపీలో చేరిన వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ కన్నేసి పెట్టారట. ఎవరినీ అంత తొందరగా నమ్మడం లేదట. పైగా అనుకున్నట్లుగా రాజకీయ పదవులు..కాంట్రాక్టులు, పనులు ఏమీ దక్కడం లేదనే అసంతృప్తిలో జంపింగ్‌ లీడర్లు ఉన్నారనేది ఓ టాక్. వాళ్లకు అప్పటికే కూటమి పార్టీల్లో ఉన్న లోకల్ లీడర్లతో కూడా సరిగ్గా పొసగడం లేదట. దీంతో వారంతా తిరిగి వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం మొదలైంది.

అయితే అలా వస్తామంటున్న నేతలను ఫ్యాన్ పార్టీ చేర్చుకుంటుందా లేదా అనేది ఇంకో చర్చ. అయితే జరిగిందేదో జరిగిపోయింది..మీరొస్తానంటే మేమొద్దంటామా అన్నట్లుగా వైసీపీ అధిష్టానం ఆలోచన అని చెప్తున్నారు. అసలే నియోజకవర్గాలకు ఇంచార్జ్ లు లేక.. చాలా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ నేతలు కరువై..కీలక సామాజికవర్గాల నేతలంతా పార్టీని వీడిపోవడంతో గందరగోళ పరిస్థితులను ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే టైమ్‌లో పలువురు నేతలు వైసీపీలోకి వస్తామంటున్నారన్న ప్రచారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్‌ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తోందట.

తిరిగి వైసీపీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతున్న ఫస్ట్ పేరు విజయసాయిరెడ్డి..!
తిరిగి వైసీపీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతున్న ఫస్ట్ పేరు విజయసాయిరెడ్డి. జగన్ కోటరితో గిట్టడం లేదంటూ చెప్పకనే చెప్పి..వైసీపీని వీడి, రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి..రాజకీయాలకు గుడ్‌బై చెప్పారాయన.

Also Read: పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు? జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆసిమ్ మునీర్?

అప్పుడప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారు విజయసాయి. ఆ మధ్య ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే కాషాయగూటికి చేరాలని విజయసాయిరెడ్డి అనుకున్నా..కూటమి నుంచి బ్రేకులు పడటంతో..ఆయన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మళ్ళీ వైసీపీ వైపు రావచ్చన్న సోషల్‌ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

గత ఎన్నికల తర్వాత పార్టీ నుంచి అనేకమంది నాయకులు వెళ్లిపోయారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు..సామాజిక వర్గాల వారీగా ప్రభావితం చేయగలిగిన లీడర్లు కూడా ఉన్నారు. జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా జగన్ ను కాదనుకుని దూరమయ్యారు. వారు వెళ్లిపోయినప్పుడు గాని..వెళ్ళిపోయిన తర్వాత గాని పార్టీ వారిపై ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా వారు వెళ్లిపోవడాన్ని..తాను తప్పు పట్టడం లేదని జగన్ కూడా సర్టిఫికెట్ ఇచ్చారు.

అవకాశాలు దక్కని చోట, నమ్మకం లేని దగ్గర ఉండటం ఎందుకని థింకింగ్..
అయితే ఈ నేతలకు కూటమి పార్టీల్లో అనుకున్నంత గుర్తింపు దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకాశాలు దక్కనిచోట, నమ్మకం లేని దగ్గర ఉండటం ఎందుకని..పలువురు నేతలు థింకింగ్‌లో పడ్డారన్నది చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఘర్ వాపసీకి ఓకే చెప్తుందా? వచ్చే వారికి అడ్డు చెప్పకూడదని డిసైడ్ అయిందా అనేది పెద్ద చర్చగా మారింది.

మరి ఎంతమంది వస్తారు? ఏం జరుగుతుందనేది ఇప్పటికైతే సస్పెన్సే. అయితే రాజకీయాల్లో వచ్చిన ప్రతీ పుకారు నిజం కాదు. అలా అని పలు గాసిప్స్ నిజం అయిన సందర్భాలూ ఉన్నాయి. మరి వైసీపీలో తిరిగి చేరికల విషయంలో రాయబారాలు ఏమైనా జరుగుతున్నాయా? లేక ఉట్టి ప్రచారమేనా అన్నది చూడాలి.