Attack YSRCP Mlc Bharath Pa
Attack YSRCP Mlc Bharath Pa : నిన్నా మొన్నటి వరకు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ..వైసీపీ మధ్య కొనసాగిన రాజకీయ యుద్ధం కాస్తా ఇప్పుడు వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది. కుప్పంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైపీసీపార్టీకి చెందిన నేతలు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పీఏపై దాడి చేశారు. ఈ దాడికిలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్ తలకు తీవ్రంగా గాయమైంది. అతని తలపై కుట్లు వేశారు డాక్టర్లు. ప్రస్తుతం మురుగేశ్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సొంతపార్టీ నేతలే దాడి చేశారని మురుగేశ్ సోదరుడు ఆరోపిస్తున్నాడు.
కుప్పం బైపాస్ రోడ్డులోని మంజునాథ్ రెసిడెన్సీలో జరిగిన గొడవకాస్తా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురేగేశ్ పై దాడి చేసేలా మారింది. ఈ దాడిలో మురుగేశ్ తలకు బలమైన గాయాలు కావటంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రంగా ఉండటంతో డాక్టర్లు 14 కుట్లు వేశారు. ప్రస్తుతం అతని పరస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబతున్నారు. ఈ దాడిలో మరో వైఎస్సార్‌సీపీ నేత సుబ్రహ్మణ్యంకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏపై దాడి కలకలంరేపింది.