Bheemla Nayak: పవన్ సినిమాకోసం ఏయూ పరిధిలో సెలవంటూ ప్రచారం, స్పందించిన యూనివర్సిటీ యజమాన్యం

పవన్ సినిమా విడుదల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ కు సెలవు. ఫేక్ ప్రచారం నమ్మవద్దంటూ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు.

Au

Bheemla Nayak:పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అభిమానుల కోలాహలం నడుమ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో పవన్ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈనేపధ్యంలో భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలకు సెలవు ఇచ్చారంటూ చెలరేగిన పుకారు కలకలం రేపింది. “శుక్రవారం పవన్ సినిమా విడుదల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ కు సెలవు ప్రకటన” అంటూ కళాశాల యజమాన్యం సర్కులర్ జారీ చేసినట్టుగా ఒక లేఖ సోషల్ మీడియా గ్రూపులలో చక్కర్లు కొట్టింది.

Also read: Janhvi Kapoor: ఇప్పటికైతే అవన్నీ పుకార్లే.. మరి జాన్వీ ఎంట్రీ ఎప్పుడు?

ఈ విషయంపై యూనివర్సిటీ యజమాన్యం స్పందిస్తూ పుకార్లను ఖండించింది. గురువారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ ఫేక్ ప్రచారం నమ్మవద్దంటూ విద్యార్థులకు సూచించారు. ఫేక్ సర్కులర్ పై ప్రిన్సిపాల్ పేరి శ్రీనివాసరావు స్పందిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి వివరణ ఇచ్చారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎటువంటి సెలవులు ప్రకటించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న “ఫేక్ సర్కులర్”పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ పేరి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Also read: Bheemla Nayak: హిందీలో భీమ్లా రిలీజ్.. కానీ ప్రమోషన్ ఎక్కడ?