Avanthi Srinivas
Avanthi Srinivas : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దర్శి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ప్రజల తీర్పును వినయంగా, విధేయంగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలు ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ తీర్పును ఇచ్చారని అన్నారు.
చదవండి : AP Election: దాచేపల్లి వైసీపీదే.. బోణి కొట్టిన జనసేన.. గెలుపు లెక్కలు ఇవే!
ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా తమ నాయకుడు సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు అవంతి మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందని అన్నారు. మరో హైదరాబాద్‌లా అమరావతి కాకూడదని అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్ణయం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అవంతి.
చదవండి : Anil Kumar Yadav : టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా.. రాజీనామా చేస్తాం
ఇప్పటికైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే పార్టీ ప్రతిష్ట ఇంకా దిగజారుతుందని.. 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్‌పై ప్రజల ప్రేమని తగ్గించలేడని అన్నారు.
చదవండి : Kuppam : ప్రజలు బాబుకు దండం పెట్టేశారు : సజ్జల
ఎవరైతే 2019లో తమకు ఓట్లు వేయలేదో వాళ్లు కూడా తమ పరిపాలన చూసి ఇప్పుడు ఓట్లు వేశారని చెప్పారు. మూడు రాజధానులను కూడా అడ్డుకుంటున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సీఎం జగన్‌కు మధ్య ఒక అనుబంధం ఏర్పడిందని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా దాన్ని తెంచలేరని వ్యాఖ్యానించారు.