Anil Kumar Yadav : టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా.. రాజీనామా చేస్తాం

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

Anil Kumar Yadav : టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా.. రాజీనామా చేస్తాం

Anil Kumar Yadav

Anil Kumar Yadav : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని చాలెంజ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Read More..Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

తమను రాజీనామా చేసి రమ్మన్న అచ్చెన్నాయుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏం సాధించారో చెప్పాలని మంత్రి అడిగారు. నిజంగా దమ్ముంటే మీ పార్టీలో మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవండి చూద్దాం అని సవాల్ విసిరారు. 19 మందిలో టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా తాము రాజీనామా చేస్తామన్నారు. గతంలో కేసీఆర్, జగన్ రాజీనామా చేసి తమ సత్తా చూపారని మంత్రి అనిల్ గుర్తు చేశారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి చూద్దాం అన్నారు. కుప్పంలో మన పార్టీ ఓడిపోతే చాలు అని అచ్చెన్నాయుడు సహా టీడీపీ నాయకులు అందరూ కోరుకున్నారని మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ నేతలందరూ దేవుళ్లకు దండం పెట్టుకున్న సందర్భం ఇప్పుడు చూస్తున్నాం అన్నారు. ఆ పార్టీ నేతలను చంద్రబాబు మీరు ఎందుకు గెలవలేదు అనే ప్రశ్న రాకూడదని కోరుకున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీల కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ గెలుపొందింది.

Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. అన్ని చోట్లా అధికార వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కైవసం చేసుకుంది.

ఇప్పటిదాకా అధికార పార్టీ 9 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పం, నెల్లూరు, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో జయకేతనం ఎగురవేసింది. ఇటు నెల్లూరు కార్పొరేషన్ లోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది. మొత్తం 54 డివిజన్లకు గాను 8 ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు ఎన్నిక జరిగిన 46 డివిజన్లను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీచింది. దర్శి నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో పడింది.

దర్శి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డులో ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గాను 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 3, 4, 10, 12, 13, 14, 15, 17, 18, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే 1, 2, 5, 6, 7, 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం స్పష్టంగా కనిపించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 25 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. కేవలం 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఎన్నికలకు ముందే 14వ వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. ఈ నేపథ్యంలో వైసీపీ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు ఈ విజయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు.