Vijayawada : విజయవాడలో మహిళను బురిడీ కొట్టించిన బాబా.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు

కొంత స్థలం అమ్ముడు పోయిన తర్వాత తనకు రూ.4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని మహిళను బాబా బెదిరించారు. బాబా వేధింపులు పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

Baba cheat woman

Vijayawada Baba Cheating Toman : ఏపీలో మేకుల బాబా భాగోతం బయటపడింది. విజయవాడలో ఓ మహిళను బురిడీ కొట్టించి నాలుగు మేకులు కొట్టి లక్షల రూపాయలు కొట్టేశాడు. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా మహిళను వేధింపులకు దిగిన వైనం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో సుంకర రజనీ అనే మహిళ తన 14 సెంట్ల స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. స్థలం అమ్ముడు పోకపోవడంతో మహిళ సమస్యను బాబాకు చెప్పుకున్నారు. స్థలం అమ్ముడుపోవాలంటే మేకులు కొట్టాలని బాబా చెప్పారు. మహిళ నుంచి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతారు.

Delhi: పద్నాలుగేళ్ల బాలికపై తాంత్రికుడి అత్యాచారం.. భూతవైద్యం పేరుతో ఘాతుకం

కొంత స్థలం అమ్ముడు పోయిన తర్వాత తనకు రూ.4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని మహిళను బాబా బెదిరించారు. బాబా వేధింపులు పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.