Badvel
Badvel By-Election : కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ వెల్లడించారు. 2021, అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భారీ భద్రత నడుమ భద్ర పరిచారు. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం పట్టణ శివారులోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా…ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ మీడియాతో మాట్లాడారు.
Read More : PUC certificates : PUC సర్టిఫికెట్ లేదా? రూ.10వేలు జరిమానా.. 6 నెలల జైలు!
281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడం జరిగిందని, కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతుందని, కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సూపర్ వైజర్, మైక్రో అజ్వర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ 233, సర్వీస్ ఓటర్లు ముందుగా లెక్కగడుతామని, వీటి ఫలితాలు 8 గంటల తర్వాత వస్తాయన్నారు. వర్షం వల్ల కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణనివ్వడం జరిగిందన్నారు.
Read More : PUC certificates : PUC సర్టిఫికెట్ లేదా? రూ.10వేలు జరిమానా.. 6 నెలల జైలు!
మొత్త పది రౌండ్స్ లో ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటలకే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేసింది వైసీపీ పార్టీ. మెజార్టీ మాత్రం తగ్గిస్తామని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2, 15, 392 ఉండగా…1,46,562 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Read More : India 31 Children Die : ప్రతిరోజూ 31మంది చిన్నారుల ఆత్మహత్య! : NCRB రిపోర్టు
చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది. బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,15,292 కాగా.. వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355మంది, థర్డ్ జండర్ 22 మంది ఉన్నారు.