India 31 Children Die : రోజూ 31మంది చిన్నారుల ఆత్మహత్య! : NCRB రిపోర్టు

భారతదేశంలో కరోనా మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. 2020 ఏడాదిలో చిన్నారులు తీవ్రంగా మానసికక్షోభకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

India 31 Children Die : రోజూ 31మంది చిన్నారుల ఆత్మహత్య! : NCRB రిపోర్టు

India Saw 31 Children Die By Suicide Every Day In 2020

India 31 children die every day : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ప్రభావం కనిపిస్తూనే ఉంది. భారతదేశంలో కరోనా మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. ప్రత్యేకించి 2020 ఏడాదిలో చిన్నారులు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్నారులు ఏదో ఒక కారణంతో రోజుకూ 31 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక వెల్లడించింది. 2020లో 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న 11,396 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 2019లో కన్నా 2020లో 18శాతం ఎక్కువగా నమోదైంది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. NCRB నివేదిక ప్రకారం పరిశీలిస్తే.. పిల్లల ఆత్మహత్యల సంఖ్య రెండేళ్ల కిందట ఆత్మహత్యల సంఖ్య కన్నా 21 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. 2019లో 9,613 మంది ఆత్మహత్య చేసుకుంటే.. 2018లో 9,413 మంది చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019 ఏడాదితో పోలిస్తే 2020 ఏడాదిలో 1,783 మంది చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read Also : CM Stalins : తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం స్టాలిన్‌

ఆత్మహత్యకు పాల్పడిన మొత్తం చిన్నారుల్లో 5,392 మంది బాలురు ఉంటే.. 6,004 మంది బాలికలు ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న చిన్నారుల్లో ఎక్కువగా కుటుంబ సమస్యలతో 4,006 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. 1,337 మంది ప్రేమకు సంబంధించి సమస్యలతో తనువు చాలించారు. 1,327 మంది అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోగా.. మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మనూన్యత, నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలతో చిన్నారుల ఆత్మహత్యలు చేసుకున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో అందరికి దూరంగా ఉండటం.. స్కూళ్లు మూతబడటం, ఇళ్లకే పరిమితం కావడం వంటి అనేక కారణాలతో చాలామంది చిన్నారులు మానసికంగా కృంగిపోయి మనస్తాపంతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు పాల్పడినట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు.
Read Also : Australia : కోవాగ్జిన్ టీకాకు గుర్తింపు.. ఆంక్షలు ఎత్తేసిన ఆస్ట్రేలియా!