CM Stalins : తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం స్టాలిన్‌

తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పెద్దమనస్సుని చాటుకున్నారు. తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చారు.

CM Stalins : తన కాన్వాయ్‌ను నిలిపివేసి..అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం స్టాలిన్‌

Cm Stalins Convoy Gives Way To Ambulance While Enroute

cm stalins convoy gives way to ambulance while enroute : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తనదైన శైలి పాలనతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈక్రమంలో మరోసారి తన పెద్దమనస్సుని చాటుకున్నారు. తన కాన్వాయ్ పై వెళుతుండగా ఆ దారిలో వస్తున్న ఓ అంబులెన్స్ కు తన కాన్వాయ్ ను ఆపివేసి మరీ దారి ఇచ్చారు. కోయంబ‌త్తూరు-వెల‌చెరి రూట్లో సీఎం కాన్వ‌య్ వెళ్తున్న స‌మ‌యంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వ‌చ్చింది. వేగంగా వెళ్తున్న ఆ అంబులెన్స్ కోసం సీఎం స్టాలిన్ కాన్వాయ్ ను మార్గం మధ్యలోనే ఆపివేయించారు.అనంతరం అంబులెన్స్ కు దారి ఇచ్చారు. రోడ్డు పక్కన ఎడ‌మ వైపు కాన్వాయ్‌ను ఆపి .. అంబులెన్స్‌కు మార్గాన్ని క‌ల్పించారు. దీనిపై సీఎం స్టాలిన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. దటీజ్ సీఎం స్టాలిన్ అంటూ ప్రశంసిస్తున్నారు.

కాగా..సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లోని వాహ‌నాల సంఖ్య‌ను త‌గ్గించాల‌ని అధికారులకు ఆదేశించారు. కాన్వాయ్ వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య‌లు వస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కాబట్టి కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించేయాలని ఆదేశించారు. అలా 12 వాహనాల కాన్వాయ్ ని 6కు తగ్గించారు. సీఎం కాన్వాయ్ కుదింపుపై చెన్నై హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో చీఫ్ డిఫెన్స్ విషయంలో రాజీపడవద్దని న్యాయమూర్తి సూచించడం గమనించాల్సిన విషయం.

Read more : CM surprise visit to school : పాఠశాలలో సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు..షాక్ అయిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

సీఎం స్టాలిన్ వాహ‌న‌శ్రేణి (కాన్వాయ్) లో రెండు పైలెట్ వాహ‌నా లు, మూడు ఎస్కార్ట్ వాహ‌నాలతో పాటు ఓ జామ‌ర్ వాహ‌నం కూడా ఉంటుంది. స్టాలిన్‌కు ప్ర‌స్తుతం జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీని అధికారులు కల్పించారు. సీఎం కాన్వాయ్‌లోని అడ్వాన్స్ పైలెట్ వాహ‌నం వెళ్లిన త‌ర్వాత అయిదు నిమిషాల ముందు మాత్ర‌మే ట్రాఫిక్‌ను ఆప‌నున్నారు.ఈ క్రమంలో సీఎం స్టాలిన్ సోమవారం (నవంబర్ 1,2021) ఉదయం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెళుతుండగా మార్గ మధ్యలో అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ను ఆపివేసి దారి ఇచ్చారు. చెన్నైలో ఈరోజునుంచే స్కూళ్లు ఓపెన్ చేస్తున్నారు. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బ‌డులు తెరిచారు. ఈ నేప‌థ్యంలో సీఎం స్టాలిన్ విద్యార్థుల‌కు పుస్త‌కాల‌ను పంపిణీ చేశారు.

కాగా ఇటీవల సీఎం స్టాలిన్ సడెన్ గా ఓ స్కూల్లో తనిఖీలకు వెళ్లారు. దీంతో సీఎం స్కూల్లో ప్రత్యక్షమయ్యేసరికి ఉపాధ్యాయులతో పాటు విద్యార్ధులంతా ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. అలా స్కూల్ కు వెళ్లిన సీఎం స్కూల్లో ఉపాధ్యాయుల్ని, విద్యార్దుల్ని ఆప్యాయంగా పలకరించారు. స్కూల్లో మధ్యాహ్నా భోజనాలు వండే ప్రాంతాన్ని పరిశీలించారు. ఎప్పుడు పరిశుభ్రంగా వండి విద్యార్దులకు వడ్డించాలని..విద్యార్ధులంతా మీ సొంత పిల్లల్లాంటివారే అన్నట్లుగా వారికి పరిశుభ్రంగా వండి వడ్డించాలని సూచించారు.

Read more : CM surprise visit to school : పాఠశాలలో సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు..షాక్ అయిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

కాగా సీఎంగా స్టాలిన్ బాద్యతలు తీసుకున్నప్పటినుంచి తనదైన శైలి పాలన అందిస్తున్నారు. సీఎం అనే హోదాలో కాకుండా సామాన్య వ్యక్తిలా ఆలోచిస్తు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ గతంలో తమిళనాడు సీఎంల మార్కుని చెరిపివేశారనే పేరు తెచ్చుకుంటున్నారు.