CM surprise visit to school : పాఠశాలలో సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు..షాక్ అయిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వ పాఠశాలలో సడెన్ ఎంట్రీ ఇచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయుల్ని,విద్యార్ధుల్ని ఆప్యాయంగా పలకరించారు. మధ్యాహ్నా భోజనాలు వండే ప్రాంతాన్ని పరిశీలించారు.

10TV Telugu News

CM Stalin  surprise visit to school : సీఎం ఎంకే స్టాలిన్‌ తన మార్కు పాలనతో ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులతో శెభాష్ అనిపించుకుంటున్నారు. తమిళనాడులో కరుణానిథి వారసుడిగా అధికారంలోకి వచ్చిన స్టాలిన్ తనదైన శైలిలలో పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం (అక్టోబర్ 27,2021) సీఎం స్టాలిన్ ప్రభుత్వం స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా సీఎం స్వయంగా విద్యార్ధులతో మాట్లాడారు.ఎలా చదువుకుంటున్నారు? ఇక్కడ ఎటువంటి సౌకర్యాలున్నాయి? మీకు అన్ని సక్రమంగా అందుతున్నాయా? అని ప్రశ్నించారు.

బుధవారం ఉదయం చెంగల్పట్టు జిల్లా కడపాక్కం పి.కృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సీఎం తనిఖీ నిర్వహించారు. విల్లుపురం జిల్లా ముదలియార్‌కుప్పంలో ‘ఇంటి వద్దకే విద్య’ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం స్టాలిన్‌ కారులో వెళుతూ మార్గమధ్యంలో కడపాక్కం వద్ద ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. సీఎంను చూసిన విద్యార్ధులు సంతోషపడిపోయారు.తాము సీఎంను కలుస్తామని అస్సలు అనుకోలేదని..కానీ సీఎం సడెన్ గా మా స్కూల్లో ప్రత్యక్షమయ్యేసరికి అంతా కలలా ఉందని ఊహించని అతిథి కళ్లముందే కనిపించటంతో పట్టరాని సంతోషంగా ఉందని విద్యార్థు సంతోషం వ్యక్తంచేశారు.

Read more : MK Stalin: ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వాటర్ ఫాల్స్.. ప్రమాదమంచున తల్లీబిడ్డ – స్టాలిన్ షేర్ చేసిన వీడియో

సీఎం సడెన్ గా స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి ఉపాధ్యాయులు కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీఎంను చూసిన టీచర్లంతో సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకునే లోపే స్టాలిన్‌ వారివద్దకెళ్లి వారి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. సీఎం స్టాలిన్‌ వెంట రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇతర అధికారులు కూడా వున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెర్నాస్‌ జాన్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది స్టాలిన్‌కు సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం స్టాలిన్‌ స్వయంగా క్లాస్ రూములకు వెళ్లి విద్యార్థుల్ని ఆప్యాయంగా పలకరించారు. విద్యార్ధులకు పాఠాలు చెబుతున్న టీచర్లను పలకరించారు.విద్యార్థులంతా చక్కగా చదువుకోవాలని.. విద్యార్ధులంతా కరోనా నిరోధక నిబంధనలను పాటించాలని స్టాలిన్‌ సూచించారు. దానికి విద్యార్ధులంతా అలాగే పాటిస్తున్నాం సార్ అంటూ సమాధానం చెప్పారు.

Read more : Corona to Home Minister : మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సేకు రెండోసారి కరోనా

అలా సీఎం స్టాలిన్ అన్ని క్లాస్ రూముల్లోను కలియతిరిగారు. తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మెనూ మేరకు సిద్ధం చేశారా లేదా అని పరిశీలించారు. తమ బిడ్డలుగానే భావించి, పిల్లలకు సరిగ్గా ఆహారం వండి వడ్డించాలని వంటలు చేసేవారికి సూచించారు. అలాగే వంటలు చేసే ప్రాంతాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పరిశుభ్రతకలిగిన వంటలనే విద్యార్ధులకు పెట్టాలని సూచించారు. తనిఖీ ముగించుకుని వెళుతున్న సీఎంని విద్యార్థులు చుట్టుముట్టారు. మిమ్మల్ని ఇలా నేరుగా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు సార్.. చాలా చాలా కృతజ్ఞతలు అని తెలిపారు. దానికి సీఎం చిరునవ్వులు చిందిస్తు వెళ్లిపోయారు.