MK Stalin: ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వాటర్ ఫాల్స్.. ప్రమాదమంచున తల్లీబిడ్డ – స్టాలిన్ షేర్ చేసిన వీడియో

తమిళనాడులోని వాటర్ ఫాల్స్ వద్ద ఇరుక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్న వారిని ప్రమాదమని తెలిసినా.. ఎదురెళ్లి తల్లీబిడ్డను కాపాడారు. ఈ వీడియోను స్వయంగా తమిళనాడు సీఎం..

MK Stalin: ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వాటర్ ఫాల్స్.. ప్రమాదమంచున తల్లీబిడ్డ – స్టాలిన్ షేర్ చేసిన వీడియో

Tamilnadu

MK Stalin: తమిళనాడులోని వాటర్ ఫాల్స్ వద్ద ఇరుక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్న వారిని ప్రమాదమని తెలిసినా.. ఎదురెళ్లి తల్లీబిడ్డను కాపాడారు. ఈ వీడియోను స్వయంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

కొండ పక్కగా నిల్చొని ఎగసిపడుతూ.. అతి వేగంగా వస్తున్న నీటి ప్రవాహం తాకకుండా తల్లీబిడ్డ నిల్చొన్నారు. కూతురు జారిపోకుండా పట్టుకున్న ఆ తల్లి ఒక చేత్తో కొండను మరో చేత్తో బిడ్డను పట్టుకుని ప్రమాదం నుంచి గట్టెక్కాలని చూస్తుంది. కాస్త పట్టు జారిందా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే.

ఇదంతా సాలెం జిల్లాలోని అనైవరీ ముట్టల్ వాటర్ ఫాల్స్ వద్ద జరిగింది. ఉన్నట్టుండి వరద ప్రవాహం వచ్చేయడంతో ఈ వాతావరణం నెలకొంది.

…………………………………….. : ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ తో చిందేసిన శ్రీవల్లి

అంతలో యువకుల గుంపు ఓ తాడు సాయంతో వేలాడుతూ.. మహిళ వద్దకు చేరుకున్నారు. మరొకరు కింద వైపు నుంచి వచ్చి ఆమెకు ధైర్యం చెప్పి ముందు పాపను పైకి పంపించారు. ఆ తర్వాత మహిళకు సాయమందించి పైకి ఎక్కించారు. ఎట్టకేలకు ఆ ప్రవాహం నుంచి ఇద్దరు బయటపడ్డారు.

ఈ ధైర్యవంతమైన చర్యకు.. సీఎం అభినందనలు తెలిపారు. మానవత్వం ఇలాంటి వారి మనసుల్లో వెలిగిపోతుందంటూ కొనియాడారు.

‘తల్లీ కూతుళ్లను కాపాడిన వారి సాహసోపేతమైన చర్య అభినందనీయం; ప్రభుత్వం ద్వారా వీరికి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు సాహసం చేసేవారి మనసుల్లో మానవత్వం వెలిగిపోతుంది! విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు స్టాలిన్.