Australia : కోవాగ్జిన్ టీకాకు గుర్తింపు.. ఆంక్షలు ఎత్తేసిన ఆస్ట్రేలియా!

భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ రూపొందించిన కోవాగ్జిన్ (Covaxin) టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. కోవాగ్జిన్ టీకా తీసుకున్నవాళ్లు ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

Australia : కోవాగ్జిన్ టీకాకు గుర్తింపు.. ఆంక్షలు ఎత్తేసిన ఆస్ట్రేలియా!

Australia Recognises Covaxin For Travel As It Eases Border Curbs

Covaxin For Travel : భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ రూపొందించిన కోవాగ్జిన్ (Covaxin) టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఇకపై కోవాగ్జిన్ టీకా తీసుకున్నవాళ్లు ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసింది. కోవాగ్జిన్‌కు ఇంకా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ రాలేదు. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్ర‌యాణికుల‌కు ఆస్ట్రేలియా ఊరటనిచ్చింది. 600 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు ఆస్ట్రేలియా అనుమతినిచ్చింది. దాంతో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులు ఆస్ట్రేలియాకు క్యూ కట్టేస్తున్నారు.

ప్ర‌యాణికుల వ్యాక్సినేష‌న్ స్టేటస్ విష‌యంలో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తున‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా హై క‌మిషన‌ర్ బారీ ఓ ఫారెల్ ఏవో ఒక ప్రకటనలో వెల్లడించారు. దాదాపు 18 నెలలు గ్యాప్ తర్వాత సరిహద్దు కరోనా ఆంక్షలను ఎత్తేయడంతో మిలియన్ల మంది ఆస్ట్రేలియన్లు స్వేచ్చగా ట్రావెల్ చేసేందుకు అనుమతి లభించింది. దేశానికి చేరుకున్న సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులు ఎలాంటి క్వారంటైన్ ఉండాల్సిన అవసరం ఉండదు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, సినోఫార్మ్ చైనా తయారుచేసిన BBIBP-CorV టీకాలకు ట్రావెల్ వ్యాక్సినేషన్ స్టేటస్ దృష్ట్యా ఆస్ట్రేలియా అనుమతినిచ్చింది.
Read Also : Commercial Cylinder : గ్యాస్ ధర పెరిగింది, ఆందోళనలో చిరు వ్యాపారులు!

ఆస్ట్రేలియాకు వచ్చే ప్రయాణికుల్లో 12ఏళ్లు లేదా ఆపై వయస్సు వారు కోవాగ్జిన్ తీసుకుంటే అనుమతించనుంది. అలాగే 18ఏళ్ల నుంచి 60ఏళ్ల పైబడిన వారు BBIBP-CorV వ్యాక్సిన్ తీసుకుంటే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టవచ్చునని ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇకపై భారత్ తో పాటు చైనా, ఇతర దేశాల్లోని ఏ ప్రాంతం నుంచి అయినా అంతర్జాతీయ ప్రయాణికులు ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చు. అయితే కోవాగ్జిన్ పూర్తి వ్యాక్సినేషన్ తీసుకున్నవారికి మాత్రమే అనుమతించనుంది.

ఆస్ట్రేలియాకు చెందిన థెర‌పాటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేష‌న్ (TGA) రెండు కొత్త వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు సమాచారం. టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూపు ఆమోదం పొందిన టీకా వేయించుకన్న ప్ర‌యాణికుల‌కు తమ దేశంలోకి అనుమ‌తిస్తామని ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. ఆస్ట్రాజెనికా, మోడెర్నా.. మిక్సిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న‌వారికి కూడా అనుమ‌తి ఉంది. కోవాగ్జిన్‌, సైనోఫార్మ్‌ టీకాలకు కూడా అనుమతి లభించడంతో ఆస్ట్రేలియాలో 14 రోజుల హోట‌ల్ క్వారెంటైన్ అవసరం ఉండదని అక్కడి అధికారులు వెల్ల‌డించారు. రెండో డోసులు తీసుకోని వారు మాత్రం తప్పక క్వారెంటైన్‌లో ఉండాల్సిందే.
Read Also : Jio Phone Next : జియో ఫోన్‌ ‘Pragati OS’ ఏంటి.. ఎలా పనిచేస్తుంది? ఫీచర్లు ఏమున్నాయంటే?