LPG Price : గ్యాస్ ధర పెరిగింది, ఆందోళనలో చిరు వ్యాపారులు!

రెండు నెలల విరామం అనంతరం ఒకేసారి రూ. 266 వడ్డించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని తెలుసుకున్న చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.

LPG Price : గ్యాస్ ధర పెరిగింది, ఆందోళనలో చిరు వ్యాపారులు!

Gas

Commercial Cylinder : పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇప్పటికే తగ్గేదేలే అన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా…ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసింది. ధరలు పెరగడానికి రకరకాల కారణాలు చెబుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 266లు పెంచేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సిలిండర్ ధర రూ. 2 వేలకు అటుఇటూగా నమోదవుతోంది. హైదరాబాద్ లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1905.32కి చేరుకుంది.

Read More : Diwali Movies : దీపావళి కానుకగా థియేటర్ లో/ ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే

ఇటీవలే..ఆగస్టు 17వ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. రెండు నెలల విరామం అనంతరం ఒకేసారి రూ. 266 వడ్డించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని తెలుసుకున్న చిరు వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ రంగంపై ఆధారపడిన వారు కూడా ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. చిరు వ్యాపారస్థులు కరోనా కారణంగా..వ్యాపారాలు నష్టపోయి..ఆర్థికంగా చితికపోయిన సంగతి తెలిసిందే. పరిస్థితులు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు జోరందకుంటున్నాయి.

Read More : YouTuber Helicopter : ఫిజిక్స్‌ ప్రశ్నకు ఆన్సర్ కోసం.. ఈ యూట్యూబర్‌ ఎంతపనిచేశాడు!

పోయిన ఆదాయం పుంజుకుంటుంటే…ఇప్పుడు గ్యాస్ ధరలు ఆ ఆనందాన్ని హరించివేస్తున్నాయంటున్నారు. టీ, టిఫిన్, ఇతరత్రా ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీపావళి తర్వాత..ధరలు పెరగవచ్చని..అందరూ ఆశించారు. కానీ పండుగ రాకముందే…ధరలు పెంచేసింది. మరోవైపు గ్యాస్ పై అందిస్తున్న సబ్సిడీలను కూడా క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రెండు నెలలకాలంలో గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగుసార్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే…జనవరి 01వ తేదీ నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర ధర రూ. 205 వంతున పెరిగింది.