YouTuber Helicopter : ఫిజిక్స్‌ ప్రశ్నకు ఆన్సర్ కోసం.. ఈ యూట్యూబర్‌ ఎంతపనిచేశాడు!

అతడో యూట్యూబర్.. అందరిలానే అతడు కూడా.. వ్యూయర్లను ఆకట్టుకునేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఫిజిక్స్ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఏకంగా హెలికాప్టర్ అద్దెకు తీసుకున్నాడు.

YouTuber Helicopter : ఫిజిక్స్‌ ప్రశ్నకు ఆన్సర్ కోసం.. ఈ యూట్యూబర్‌ ఎంతపనిచేశాడు!

Watch Youtuber Rents Helicopter To Solve Physics Question

Updated On : November 1, 2021 / 12:26 PM IST

YouTuber Helicopter : అతడో యూట్యూబర్.. అందరిలానే అతడు కూడా.. వ్యూయర్లను ఆకట్టుకునేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఫిజిక్స్ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఏకంగా హెలికాప్టర్ అద్దెకు తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. చివరికి ఆ ప్రశ్నకు సమాధానం కూడా కనిపెట్టేశాడు. అతడే డెరిక్ ముల్లర్.. వెరిటాసియం అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు. 2014 అమెరికా ఫిజిక్స్ ఒలింపియాడ్ లో ఓ ప్రశ్న అతడిని ఆలోచింప చేసింది.

హెలికాప్టర్ గాల్లో ఎగురుతున్న సమయంలో కేబుల్ కిందికి ఏకరితీ కేబుల్ వేస్తే ఎలా వేలాడుతుంది? ఫిజిక్స్ ఒలింపియాడ్ లో అడిగిన 19వ ప్రశ్న ఇది.. ఈ ప్రశ్నకు ఎలాగైనా సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. హెలికాప్టర్ అద్దెకు తీసుకుని ఈ ఎక్స్ పర్ మెంట్ పూర్తి చేశాడు. ప్రశ్నలో అడిగినట్టుగానే అవసరమైన అన్ని వస్తువులు సిద్ధం చేసుకున్నాడు. హెలికాప్టర్ ఎక్కేశాడు. హెలికాప్టర్ ఎక్కగానే ఆ ప్రశ్నను చదివి వినిపించాడు.

సరైన సమాధానం ఏంటో కన్ఫూజన్ గానే ఉంది. ఎలాంటి టూల్స్ కూడా ముల్లర్ వాడలేదు. ఇందుకోసం స్పాన్సర్‌షిప్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. ఈ ప్రయోగం తర్వాత అతడికి సమాధానం దొరికింది.. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ‘D’ అని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్‌లో తాను పోస్టు చేసిన ప్రశ్నకు చాలానే జవాబులు వచ్చాయి.

Watch Youtuber Rents Helicopter To Solve Physics Question (1)

అందులో 40శాతం మంది మాత్రమే C అని జవాబు ఇచ్చారు. 25 శాతం మంది B అని ఇవ్వగా.. 21శాతం మంది D అని సమాధానమిచ్చారు. సమాధానం ఏమై ఉంటుంది? అనేది పక్కన పెడితే.. ముల్లర్ ప్రయత్నాన్ని మాత్రం అతడి ఛానల్ వ్యూయర్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Also : Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బర్త్ డే స్పెషల్..