Pawan Kalyan : ఎన్నికలకు దూరం.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడం లేదని తెలిపారు. మృతి చెందిన ఎమ

Pawan Kalyan

Pawan Kalyan : కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడం లేదని తెలిపారు. మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని పవన్ వెల్లడించారు. మానవతా దృక్పథంతోనే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని, బద్వేలు ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని పవన్ తెలిపారు.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

పవన్ కళ్యాణ్ ఏపీలో జనసేన శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న తర్వాత బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు దగ్గర భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

పాలకుల దగ్గర డబ్బు ఉందని, కానీ వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జనసేనకు అధికారం ఇస్తే రాయలసీమలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని పవన్ మరో కీలక ప్రకటన చేశారు. రాయలసీమలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామని స్పష్టం చేశారు.

Hair Fall : చేప, చక్కర, గుడ్డు తెల్లసొన అధికంగా తింటున్నారా! అయితే అది రావటం ఖాయం?

నాకు అవకాశం ఇవ్వండి… మీ కష్టాల్లో తోడుంటాను అని పవన్ అన్నారు. వైసీపీ మంత్రులు, నేతలతో గొడవలు వద్దని, కోపాన్ని గుండెల్లో దాచుకోవాలని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సమయం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దామని అన్నారు. మీ అందరి కోసం కుటుంబాన్ని వదిలి వచ్చానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు.

”రాయలసీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు. పుట్టపర్తి సాయిబాబా ఒక్కరే అంత పని చేస్తే, ప్రభుత్వం ఎంత చేయాలి? కియా పరిశ్రమను కూడా బెదిరించారు. రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెడతాం. అభివృద్ధి చేస్తాం. పోరాడేందుకు టీడీపీ ముందుకు రావడం లేదు. జనసేనకు అలాంటి భయం లేదు” అని పవన్ అన్నారు.

కాగా, బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేస్తుందని, తమ అభ్యర్థిని నిలుపుతుందని వార్తలు వచ్చాయి. ఇంతలోనే పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

బద్వేల్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 16 వేల 139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1 లక్షా 7 వేల 340 మంది మహిళా ఓటర్లు, లక్షా 8 వేల 799 మంది పురుష ఓటర్లు ఉన్నారు.

బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్ ఉప ఎన్నికకు టీడీపీ చీఫ్ చంద్రబాబు చాలా ముందుగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేశారు. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను బరిలో దింపనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య స్వస్థలం కడప జిల్లా బద్వేలు మండలోని మల్లెలవారిపల్లి. మారుమూల గ్రామంలో జన్మించిన వెంకట సుబ్బయ్య చిన్నతనం నుంచి చదువులో ప్రతిభచూపి వైద్య విద్యను అభ్యసించారు. 2016లో బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

బద్వేల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసీపీ.. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను తమ అభ్యర్థిగా ప్రకటించింది.