Taraka Ratna Health
Taraka Ratna Health: హీరో తారకరత్న ఇటీవల కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు తారకరత్నకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఇంకా అతని ఆరోగ్యం విషమంగానే ఉంది. తాజాగా, తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యంపై పలు విషయాలను వెల్లడించారు.
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది, చికిత్సకు సహకరిస్తున్నాడు, ఒకసారి రెస్పాండ్ అయ్యాడని బాలకృష్ణ తెలిపారు. అయితే, తారకరత్నకు బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయ్యిందో తర్వాత తెలుస్తుందని అన్నారు. స్టంట్ వేయడం కుదరలేదని, అలాచేస్తే మళ్లీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. తారకరత్న త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని బాలకృష్ణ అన్నారు.
Taraka Ratna : తారకరత్నకు ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స..
బెంగళూరులోని నారాయణ హృదయాలయం ఆస్పత్రి వద్ద బాలకృష్ణతో పాటు కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఉన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని 10మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం అతనికి ఎక్మో ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు వసుందర, బ్రాహ్మిణితో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దనే ఉన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు.