అమెరికాలో ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ పై బాలయ్య, జగన్ పేర్లు

  • Publish Date - November 8, 2020 / 10:50 AM IST

Balayya and Jagan names : అమెరికాలో ఎలా ఎన్నికలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. బ్యాలెట్ పత్రం ద్వారా..అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. ఎవరూ నచ్చని వారు..ఓటుకు దూరంగా ఉంటారు. కానీ కొంతమంది బ్యాలెట్ పేపర్ పై ఎవో రాతలు రాయడం చూస్తుంటాం. భారతదేశంలో కొందరు ఓటర్లు..ఈ పత్రాలపై అభిప్రాయాలు రాయడం లేదా..ఏదో చిత్రాలు రాయడం వంటివి గమనిస్తాం. కానీ..అమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై సీబీఎన్ బాలయ్య, జగన్ వంటి పేర్లు రాసినట్లు వెలుగు చూసింది.



పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా..థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే..చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఈ కాలమ్ లోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు కనిపించడం గమనార్హం.



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై బైడెన్ విజయం సాధించారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే. అత్యధికంగా ఓట్లు సాధించినా..అమెరికాకు అధ్యక్షులు కాలేరు. కేవలం ఎలక్టోరల్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారే గెలిచినట్లు. ప్రతి రాష్టానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి. ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు.

ట్రెండింగ్ వార్తలు