AP CM Chandrababu Naidu, Deputy CM Pawan kalyan
Chandrababu: రాజకీయాలు చాలా డిఫరెంట్. అందులో ఏపీ పాలిటిక్స్ ఇంకా వేరు. పైగా సీఎం చంద్రబాబు మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ సమ్‌థింగ్ స్పెషల్. ఏ టైమ్‌లో..ఎప్పుడు ఏ ఇష్యూకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ఆయనకు తెలిసినట్లుగా మారే నేతకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు..అందుకు బాలయ్య రియాక్షన్..మధ్యలో చిరు ప్రస్తావనతో..ఇష్యూ పెద్ద దుమారంగా మారింది.
చిరంజీవి కూడా స్పందించడంతో పాటు ఆయన అభిమాన సంఘం కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అంశంపై జరిగిన రాద్దాంతంపై కూటమి మౌనంగా ఉంటూనే ఇష్యూకు ఆల్‌మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఇద్దరు ఇప్పటివరకు అసెంబ్లీ ఎపిసోడ్‌పై రియాక్ట్ కాలేదు. చిరంజీవి రియాక్షన్‌ను అస్త్రంగా చేసుకుని వైసీపీ కూటమిని కార్నర్ చేసే స్కెచ్ వేస్తున్నా..టీడీపీ, జనసేన ఆ ఇష్యూను అవైడ్ చేస్తున్నాయ్.
అయితే ఎంత కాదన్న ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్న టాపిక్ అదే. అందుకే ఆ ఇష్యూకు అలా..అలా తెరమరుగు చేఊసేందుకు ఇండైరెక్ట్ వేస్ అన్నీ వెతుకుతున్నారట సీఎం చంద్రబాబు. వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించి..పనిలో పనిగా అన్ని అంశాలపై డిస్కస్ చేశారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ లాంచింగ్‌పై పవన్‌తో డిస్కస్ చేశారు చంద్రబాబు.
జీఎస్టీ ఉత్సవ్‌పై చర్చ
జీఎస్టీ సంస్కరణలపై చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమం కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. ఇక అక్టోబర్ 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా ఆ రోజున జరిగే రోడ్ షోను విజయవంతం చేసే అంశంపై కూడా బాబు, పవన్ మాట్లాడుకున్నారు. వీటితో పాటుగా మెగా డీఎస్సీపై కూడా పవన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల రాజకీయ పరిస్థితులపై కూడా డిస్కస్ చేశారట. అసెంబ్లీలో ఈ మధ్య జరిగిన పరిణామాలు కచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్, కన్‌ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఉండేందుకే బాబు, పవన్ భేటీ సాగిందని అంటున్నారు. పవన్‌తో చంద్రబాబు భేటీతో..కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో కొనసాగుతోన్న రాజకీయ వేడిని ఎంతో కొంత చల్లార్చే ప్రయత్నం చేశారన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసిన తెలంగాణ బతుకమ్మ.. వీడియో చూస్తారా?
బాలయ్య వర్సెస్ చిరంజీవిగా మారిన సోషల్ మీడియా వార్‌కు ఈ భేటీతో ఓ ఇండికేషన్ ఇచ్చినట్లు అయిందని అంటున్నారు. అసెంబ్లీలో చర్చ సమయంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో చిరు హర్ట్ అయ్యారు. అందుకే ఆయన ఇమీడియేట్‌గా రియాక్ట్ అయ్యారు. సేమ్‌టైమ్ చిరుపై బాలయ్య కామెంట్స్‌తో కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతుందట. దీంతో కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి ఈ ఇష్యూను సమసిపోయేలా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది.
తన మార్క్ స్ట్రాటజీ ప్లే చేస్తున్న సీఎం చంద్రబాబు!
ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతోన్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన మార్క్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారట సీఎం చంద్రబాబు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో భేటీ అయి చర్చించిన చంద్రబాబు..సాధ్యమైనంత త్వరలో చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. అలాగని నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లినా లేక ఆయనను రప్పించుకున్నా వేరే సంకేతాలు వెళ్తాయని ఆలోచన కూడా చేస్తున్నారట. అందుకే ఏదో ఒక ఈవెంటో లేక ప్రోగ్రామ్‌లోనూ..ఫంక్షన్‌లోనో మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు కలిసేలా తెరవెనక మంత్రాంగం నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అలా మెగాస్టార్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. కూటమిలో రెండు పార్టీల క్యాడర్ లీడర్లు తొందర పడకుండా కట్టడి చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. టీడీపీ సోషల్ మీడియాలో చిరంజీవికి వ్యతిరేకంగా ఎక్కడా ఏ రకమైన ట్రోల్స్, పోస్టులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి బాబు రంగంలోకి దిగితే సీన్ అట్లుంటదని చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.