Balineni Srinivasa Reddy: మాగుంట పోటీపై క్లారిటీ ఇవ్వలేమని బాలినేనికి తేల్చిచెప్పిన వైసీపీ అధిష్ఠానం

ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు సమావేశమయ్యారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో జగన్‌ను కలవకుండానే బాలినేని..

Balineni Srinivasa Reddy-Magunta Sreenivasulu Reddy

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా వైసీపీ నేతల టికెట్ల విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. నిన్న మాగుంటతో పాటు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

మార్కాపురంతో పాటు గిద్దలూరు, కనిగిరి స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఏదీ ఫైనల్ కాలేదు. మూడు రోజులుగా విజయవాడలోనే బాలినేని ఉన్నారు. అలాగే, ప్రకాశం జిల్లాలోని పలు నియోజవర్గాల వైసీపీ నేతలు బాలినేనిని కలుస్తున్నారు. మూడు రోజులుగా సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తుండగా అపాయింట్‌మెంట్ దొరకడం లేదు.

ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల విషయంలో బాలినేని చర్చలు జరుపుతున్నారు. పలుసార్లు ఇదే విషయంపై సీఎం జగన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని బాలినేని కలిశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని చెప్పారు.

దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు సమావేశమయ్యారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో జగన్‌ను కలవకుండానే బాలినేని హైదరాబాద్ బయలుదేరారు. తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైవీ సుబ్బారెడ్డి మాటకే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బాలినేని. సీటుపై అనుమానం ఉండడంతో ఇప్పటికే టీడీపీ నేతలతో మాగుంట సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Jyotula Nehru : ముద్రగడతో జ్యోతుల నెహ్రూ భేటీ.. రాజకీయంగా మద్దతు కోరానని వెల్లడి