Balineni Srinivasa Reddy : ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఒంగోలు పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం.. తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ

అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు.

MLA Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy – Ongole Police : ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి బాలినేని లేఖ రాశారు.

ఈ కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను బాలినేని కోరారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు. కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

Also Read: కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై నారా లోకేష్ ఆగ్రహం

ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.