రాజధానిపై రిపోర్ట్ : సీఎం జగన్ చేతికి BCG నివేదిక
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(BCG) నివేదిక సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(జనవరి 03,2020) మధ్యాహ్నం 3 గంటలకు బీసీజీ ప్రతినిధులు

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(BCG) నివేదిక సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(జనవరి 03,2020) మధ్యాహ్నం 3 గంటలకు బీసీజీ ప్రతినిధులు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(BCG) నివేదిక సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(జనవరి 03,2020) మధ్యాహ్నం 3 గంటలకు బీసీజీ ప్రతినిధులు సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ తో బీసీజీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని, రాష్ట్రాభివృద్ధిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆ నివేదికను 3.30 గంటలకు సీఎం జగన్ చేతికి ఇచ్చారు. బీసీజీ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల అంశం దుమారం రేపుతున్న నేపథ్యంలో అందరి చూపు బీసీజీ నివేదికపైనే ఉంది. ప్రజల్లోనే కాదు రాజకీయ నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే రాజధాని అంశంపై బీసీజీ బృందం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను బీసీజీ కమిటీ పరిశీలించింది. బీసీజీ బృందం.. ప్రభుత్వానికి తాజగా ఇచ్చిన రిపోర్టుపై జనవరి 8న ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంటుంది, అక్కడ సానుకూలతలు ఏమున్నాయి, వనరుల లభ్యత అంశాలపై బీసీజీ స్టడీ చేసి ఓ నివేదికను రూపొందించింది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో చట్టసభల రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు విషయంలో సానుకూలతలు, ప్రతికూలతలను సాంకేతిక కోణంలో పరిశీలించి.. ప్రభుత్వానికి తగు సూచనలు, సలహాలు ఇచ్చింది బీసీజీ.
గతంలో వివిధ రాష్ట్రాల్లో రాజధానుల ఏర్పాటు సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలు, అందులో ఆయా ప్రభుత్వాల ప్రాధాన్యతలను కూడా బోస్టన్ గ్రూప్ తమ సాంకేతిక నివేదికలో పొందుపరిచింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఇప్పుడు బోస్టన్ గ్రూప్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ రెండు నివేదికలపై అధ్యయనానికి మంత్రులు, అధికారులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం అపాయింట్ చేసింది.
జనవరి 6న హైపవర్ కమిటీ తొలి సమావేశం కానుంది. జనవరి 8న జరిగే కేబినెట్ భేటీలో కమిటీ రిపోర్టులపై చర్చించనున్నారు. జనవరి నెలాఖరు(20వ తేదీ) కల్లా హైపవర్ కమిటీ కూడా నివేదిక ఇవ్వనుంది. ఈ మూడు నివేదికలపై అసెంబ్లీలో చర్చించాక రాజధానిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని జగన్ ప్రభుత్వం తెలిపింది.