Pawan Kalyan : నా ఆరోగ్యం కుదుట పడుతోంది.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి : పవన్ కళ్యాణ్

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Pawan Kalyan2

Be Alert on corona virus says Pawan Kalyan : ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య నిపుణుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తన ఆరోగ్య కుదుట పడుతోందని తెలిపారు. తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. మరణాలు తగ్గేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రజలు మాస్కులు, శానిటైజర్లు మర్చిపోవద్దని చెప్పారు.

2021, ఏప్రిల్ 16వ తేదీన పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తన వ్యవసాయం క్షేత్రంలో పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న పవన్ కు తాజాగా పాజిటివ్‌గా తేలింది.

జ్వరం, ఒళ్లునొప్పులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో పవన్‌ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయనకు వైద్యులు వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స అందిస్తున్నారు. యాంటివైరల్‌ మందులతో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని.. హైదరాబాద్‌ చేరుకున్న తరువాత.. కాస్త నలతగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే అప్పుడు ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. అయితే వైద్యుల సలహాతో క్వారంటైన్‌లోకి వెళ్లారు జనసేనాని. తిరుపతి ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు.

మరోవైపు.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత మూవీ యూనిట్‌లో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. అయన వ్యక్తిగత సిబ్బందిలో కొంత మందికి కోవిడ్ సోకడంతో క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు పాజిటివ్‌గా తేలడంతో.. పవన్ తన ఫామ్ హౌజ్‌లో చికిత్స పొందుతున్నారు.