Tirumala Hills : చిరుజల్లుల్లో తిరుమల గిరుల సరికొత్త అందాలు

తిరుమల గిరులు చిరు జల్లులతో మురిసిపోయాయి. మంచుకు తోడు చిరుజల్లులు పలకరించటంతో తిరుమల గిరులు అందంగా మారిపోయాయి.

Beauty of Tirumala Hills in Rain

Rain On Tirumala Hills : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల గిరులు చిరు జల్లులతో మురిసిపోయాయి. మంచుకు తోడు చిరుజల్లులు పలకరించటంతో తిరుమల గిరులు అందంగా మారిపోయాయి. ఆ అందాలను చూసిన వెంకన్న భక్తులు తనివితీరా ఆ అందాలను ఆస్వాదించారు. ఓ పక్క వెంకన్న నామస్మరణ..మరోపక్క మనసును ఆహ్లాదపరిచే చిరుజల్లుల అందాలకు భక్తులు పరవశించిపోయారు.

చిరుజల్లులకు తోడు తిరుమల గిరులను పొగమంచు కప్పేయటంతో ఆ అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటంలేదు. భక్తులు ఆ అందాలను ఆస్వాదింటంలో మునిగిపోయారు. మంచు దుప్పటి కప్పుకున్న తిరుమల గిరుల అందాలు కళ్లు తిప్పుకోనివ్వటంలేదు. ఎటు చూసిన ఆకుపచ్చని హరితహారంలా కనిపించే తిరుమల గిరులు చిరు జల్లులతోను..మంచుతోను కొత్త అందాలను సంతరించుకున్నాయి. ఆ ప్రకృతి అందాల మధ్య వెంకన్న దేవాలయం సరికొత్త అందాలతో మనస్సును పులకరింపజేస్తోంది.

తిరుమల కొండలపై నిన్నటి నుంచి చిరుజల్లులు కురుస్తోంది. దీంతో భక్తులు ఆ అందాలను వీడియోలు, ఫోటోల్లో బంధిస్తున్నారు. ఓ పక్క భక్తి భావం..మరోపక్క ప్రకృతి అందాలన్ని ఒకేచోట రాశి పోయినట్లుగా కనువిందు చేస్తున్న తిరుమల గిరులు కళ్లు తిప్పుకోనివ్వటంలేదు.