Mavullamma Temple: మావుళ్లమ్మ తల్లికి 100 కేజీల బంగారం.. స్వర్ణ చీరతో దర్శనం.. దేశంలోనే తొలి గ్రామదేవతగా రికార్డ్

భీమవరం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి (Mavullamma Temple)దివ్యక్షేత్రం త్వరలో ఒక అరుదైన, సువర్ణ ఘట్టానికి వేదిక కాబోతోంది.

Bhimavaram mavullamma temple to set record with 100 kg gold ornaments

  • మావుళ్లమ్మకు 100 కేజీల బంగారం
  • దేశంలోనే ఏకైక గ్రామదేవతగా రికార్డ్
  • ఆలయంలో అత్యున్నత స్థాయి భద్రత

Mavullamma Temple: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దివ్యక్షేత్రం త్వరలో ఒక అరుదైన, సువర్ణ ఘట్టానికి వేదిక కాబోతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న మావుళ్లమ్మ తల్లిని సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఆలయ కమిటీ, ప్రజాప్రతినిధులు, భక్తులు మహత్తర సంకల్పాన్ని చేపట్టారు. ఈ మహాకార్యం పూర్తయితే, ఏకంగా 100 కిలోల బంగారు ఆభరణాలు, విశేషమైన స్వర్ణ చీరతో నిత్యం దర్శనమిచ్చే దేశంలోని మొట్టమొదటి, ఏకైక గ్రామదేవతగా శ్రీ మావుళ్లమ్మ తల్లి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

స్వర్ణ చీర తయారీ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:

ప్రస్తుతం అమ్మవారిపై(Mavullamma Temple) సుమారు 52 కిలోల స్వర్ణాభరణాలు ఉండగా, భక్తుల నుంచి సేకరించిన రూ.35 కోట్ల విలువైన 23.43 కిలోల బంగారాన్ని స్థానిక ఎమ్మెల్యే స్వర్ణమయం కమిటీకి అందజేశారు. మిగిలిన 27 కిలోల సేకరణ కోసం ప్రత్యేక విరాళాల కౌంటర్‌ను ప్రారంభించారు. 100 కేజీల బంగారం నిక్షిప్తం కానున్న నేపథ్యంలో ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. భద్రత కోసం గన్ మెన్లను కేటాయించాలని కోరడంతో పాటు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, ఫేషియల్ రికగ్నిషన్ లాంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

శాకాంబరీ అలంకారం.. ఆషాఢ సారె సంప్రదాయం:

ఈ ఆలయంలో ఉత్సవాలు సైతం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని 6 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో నయనానందకరంగా శాకాంబరీ దేవిగా అలంకరించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ పూజలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సమర్పించే ఆషాఢ సారె సంప్రదాయం ఇక్కడి భక్తిభావానికి, ఆధ్యాత్మిక విశిష్టతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.