Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి వర్షాలు (Rain Alert)కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana and andhra pradesh weather alert heavy rains for next three days
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ అలర్ట్
- మూడ్రోజుల పాటు వర్షాల సూచన
- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Rain Alert: బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Rain Alert) అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయని తాజా వెదర్ బులిటెన్లో పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాగా, ఎల్నివో ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, రాబోయే రోజుల్లోనూ పెద్దగా భారీ వర్షాలు ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Arunachalam: అరుణాచలం భక్తులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆలయ కమిటీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో పిడుగుపాటు హెచ్చరికలు.. మత్స్యకారులకు అలర్ట్:
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఇప్పటికే పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
