Tirumala Alert : శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ ఆంక్షలు

ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను సాధారణంగా అనుమతిస్తోంది టీటీడీ.

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. అలిపిరి మెట్ల మార్గంలో ఏడవ మైలు వద్ద ఇటీవల భక్తులకు చిరుత పులి కనిపించింది. దీంతో ఆ మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా రాకపోకలపై ఆంక్షలు విధించింది టీటీడీ.

Also Read : గుడ్ న్యూస్.. ఏపీలో రైతులకు రూ.20వేలు ఇచ్చేది ఎప్పుడో చెప్పేశారు..

ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను సాధారణంగా అనుమతిస్తోంది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 70 నుండి 100 మంది భక్తులతో గ్రూపుగా అనుమతిస్తోంది టీటీడి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. రాత్రి 9.30 గంటలకు నడకదారిని టీటీడీ మూసివేస్తుంది.

చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆ మార్గంలో ఆంక్షలు విధించింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యాధావిధిగా అనుమతిస్తోంది. ఆ తర్వాత 70 నుంచి 100 మందితో గుంపులుగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇక, 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం తర్వాత అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.