×
Ad

Tirumala Temple : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్… ఆరోజు ఆలయం మూసివేత.. వెళ్ళేటప్పుడు చూసుకోండి.

Tirumala Temple : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్. చంద్రగహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంను మూసివేయనున్నారు.

Tirumala Temple

  • తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.
  • చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఆలయం మూసివేత
  • 11 గంటల పాటూ దర్శనాలు రద్దు

Tirumala Temple : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్. చంద్రగహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఆ రోజు పలు ఆర్జిత సేవలు, దర్శనాలు రద్దు చేయడం జరుగుతుందని, భక్తులు తమ యాత్ర ప్రణాళికను మార్చుకోవాలని టీటీడీ సూచించింది.

Also Read : Gold Price : బంగారం, వెండి ధరలు కొద్దిరోజుల్లో భారీగా తగ్గబోతున్నాయా..? కానీ, అలా జరగాలి.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు

మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 7.30గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ది, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనంకు భక్తులకు రాత్రి 8.30 గంటల నుంచి ఆలయను పున:ప్రారంభిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటితోపాటు ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.