×
Ad

Cm Chandrababu: ఆ కేసులో.. సీఎం చంద్రబాబుకి బిగ్ రిలీఫ్..

దాని వల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.

Cm Chandrababu: సీఎం చంద్రబాబుకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై నమోదైన ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. చంద్రబాబుపై అభియోగాలు నిరూపించలేకపోయింది దర్యాఫ్తు సంస్థ. దీంతో చంద్రబాబుతో పాటు మిగిలిన నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో నిబంధనలు ఉల్లంఘించి వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని, దాని వల్ల కార్పొరేషన్ కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.

కేసులో దర్యాఫ్తు పూర్తయినట్లు కొద్ది రోజుల క్రితం సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే, ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి గత నెల 24న కోర్టులో అఫడవిట్ దాఖలు చేశారు. ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అఫిడవిట్ ఇచ్చారు.

కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి ఆ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత గౌతమ్ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. తీర్పు ఇచ్చే ముందు తన వాదనలు వినాలని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనికి విచారణ అర్హత లేదంటూ న్యాయాధికారి భాస్కర్ రావు పిటిషన్ ను గురువారం కొట్టివేశారు. ఆ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టి వేస్తూ తీర్పు వెలువరించారు.

Also Read: సీట్ల పెంపు లేనట్లే.. టీడీపీకి 2029 ఎన్నికలు సవాలేనా..!?