Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్. ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరైంది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేటలో నమోదైన కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇతర కేసుల్లో పోసానికి నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో పోసాని కృష్ణమురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : ఈ రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదు, తప్పు చేస్తే తాట తీస్తా- సీఎం చంద్రబాబు వార్నింగ్
విజయవాడ ఛీప్ జుడిషియల్ కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటు.. భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసానిపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెంబర్ 657/2024 ప్రకారం ఐపీసీ 153, 153A, 354A1, 502(2), 505(1)(C) సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదైంది.