Cm Chandrababu : ఈ రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదు, తప్పు చేస్తే తాట తీస్తా- సీఎం చంద్రబాబు వార్నింగ్
గతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.

Cm Chandrababu : అసెంబ్లీ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. తప్పు చేస్తే తాట తీస్తానని ఆయన హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తే సహించేది లేదన్నారు. గంజాయి నివారణ కోసం డ్రోన్లతో నిఘా పెడతామన్నారు. గతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ ఆఫీసులపైనా దాడులు చేశారని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివి సహించేది లేదన్నారు చంద్రబాబు. రౌడీయిజం చేసే వారు తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రంలో ముఠాలు, కుమ్ములాటలు ఇకపై చెల్లవన్నారు. శాంతి భద్రతల సమస్య సృష్టితే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఎవరైనా సరే తప్పు చేస్తే తాట తీస్తామని అసెంబ్లీ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
Also Read : రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు.. వాటి ఏర్పాటుపై నారా లోకేశ్ ఏమన్నారంటే?
సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం అన్న చంద్రబాబు.. సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేస్తున్నామన్నారు. 26 సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నామన్నారు. సైబర్ క్రైమ్ చేసిన నేరస్తులను వెంటనే పట్టుకుంటామన్నారు. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారని, పోస్టుమార్టం తర్వాత వివేకాది హత్య అని తేల్చారని చంద్రబాబు చెప్పారు. హత్యా రాజకీయాల మరక అంటకుండా తాను ఇన్నాళ్లు పరిపాలన చేశానని చంద్రబాబు అన్నారు.
”గతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బూతులు లేవు.. చర్చలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో రౌడీలకు స్థానం లేదు. రౌడీయిజం చేసే వారు తప్పించుకోలేరు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తామంటే ఉపేక్షించేంది లేదు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం నెలకొంది. ఇది మంచి సంప్రదాయం కాదు.
Also Read : విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. సీఐడీ నోటీసులు.. ఆరోజున విచారణకు రావాలంటూ..
భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం. డ్రోన్లతో పెట్రోలింగ్ చేయిస్తాం. అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలమనే ధీమాలో కొందరు ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడూ హత్యా రాజకీయాల మరక అంటకుండా 45 ఏళ్లు రాజకీయాలు చేశాను. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తులను శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేశాను, శిక్షలు పడేలా చేశాను.
తమ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డన్ ను కంట్రోల్ చేయడం ఎమ్మెల్యేల బాధ్యత. లా అండ్ ఆర్డర్ ను మనం విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురు దాడి చేసి తప్పించుకుంటామంటే ఈ ప్రభుత్వం సాగనివ్వను అని మరోసారి స్పష్టంగా హెచ్చరిస్తున్నా” అని సీఎం చంద్రబాబు అన్నారు.