చంద్రబాబు కేసు.. చివరి నిమిషంలో ఊహించని బిగ్ ట్విస్ట్

చంద్రబాబు తరపున వాదించడానికి సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా సుప్రీంకోర్టుకు వచ్చారు. అటు ఏపీ ప్రభుత్వం తరపున ఏఓఆర్ హాజరయ్యారు.

Twist In Chandrababu Fibernet Case

AP Fibernet Case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో చివరి నమిషంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ చివరి నిమిషంలో వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేందుకు బెంచ్ అందుబాటులో లేదు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విచారణ జరగాల్సి ఉంది. అయితే బెంచ్ అందుబాటులో లేకపోవడందో విచారణ వాయిదా పడింది.

తమ ఇద్దరి బెంచ్ ఈరోజు కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నామని, తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ వెల్లడించారు. కాగా, చంద్రబాబు తరపున వాదించడానికి సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా సుప్రీంకోర్టుకు వచ్చారు. అటు ఏపీ ప్రభుత్వం తరపున ఏఓఆర్ హాజరయ్యారు. ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం (జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది) విచారించాల్సి ఉంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు రానుంది? చంద్రబాబుకి బెయిల్ లభిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠకు దారితీసింది. అయితే, చివరి నిమిషంలో విచారణ వాయిదా పడింది.

చంద్రబాబుపై నమోదైన కేసులు వరుసగా సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నాయి. అందులో ఒకటి ఏపీ ఫైబర్ నెట్. ఈ కేసుకు సంబంధించి గతంలో అనేకసార్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పటికీ.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెక్షన్ 17ఏకు సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉండటంతో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

Also Read : అధికారం దక్కాలంటే అక్కడ మెజార్టీ సీట్లు గెలవాల్సిందే.. ఇంతకీ ఆ జిల్లా ఏది?

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్ ఇచ్చారని, వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కు చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విచారణ జరగాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో విచారణ వాయిదా పడింది.

Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72 మందితో లిస్ట్..!

ఇవాళ ఫైబర్ నెట్ కేసును విచారించాల్సిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం రద్దైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3గంటలకు ద్విసభ్య ధర్మాసనం భేటీ కావాల్సి ఉంది. అయితే, బెంచ్ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో విచారణ వాయిదా పడింది. కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుని సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేశారు.